Search
Friday 16 November 2018
  • :
  • :

శస్త్రచికిత్సకు ముందుకొచ్చిన ఆస్ట్రేలియా వైద్యులు: లకా్ష్మరెడ్డి

veena-vaaniహైదరాబాద్: వీణా-వాణిలకు శస్త్రచికిత్స చేసేందుకు ఆస్ట్రేలి యాకు చెందిన వైద్య బృందం ముందుకొచ్చిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లకా్ష్మరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో శనివారం ఆయన వివిధ ఆసు పత్రులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆస్ట్రేలియా వైద్యులకు ఇదివరకే వీణా-వాణిలకు సంబంధించిన   వైద్య రికార్డులను, రిపోర్టులను పంపించామని, వారు పరిశీలిస్తున్నారని ఆయన తెలిపారు. అవిభక్త కవలలకు సంబంధించిన శస్త్రచికిత్స, ఇతర విషయాల్లో వైద్యుల నిర్ణయాన్నే ప్రభుత్వం పాటిస్తుందని ఆయన చెప్పారు. శస్త్రచికిత్స చేసేందుకు ఆస్ట్రేలియా వైద్య బృందం ముందుకు వస్తే ఎంతటి ఖర్చు వెచ్చించడానికైనా సిద్ధంగా ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. గతంలో శస్త్రచికిత్స చేసేందుకు వచ్చిన వైద్య బృందాలు తర్వాత వెనక్కి వెళ్లిపోయాయని మంత్రి తెలిపారు. ప్రభుత్వపరంగా వీణా – వాణిలను స్టేట్ హోంకు తరలించేందుకు యోచిస్తున్నామని మంత్రి తెలిపారు. డాక్టర్ల నిర్ణయం మేరకు తప్ప వీరి విషయంలో వేరేగా వ్యవహరించే ప్రసక్తే లేదని మంత్రి పేర్కొన్నారు.

Comments

comments