Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

యాషెస్‌ సిరీస్‌ ఆసీస్‌దే

Australia-Cricket-Team

సిడ్నీ: ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ను ఆతిథ్య ఆస్ట్రేలియా 4-0తో కైవసం చేసుకుంది. సిడ్నీలో జరిగిన చివరి టెస్టులో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 123 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టు మ్యాచుల సిరీస్‌ను కంగారులు 4-0తో ఎగిరేసుకుపోయింది. మెల్ బోర్న్ లో జరిగిన నాల్గో(బాక్సింగ్ డే) టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. చివరి టెస్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 93 పరుగులతో ఉన్న ఇంగ్లండ్ ఐదో రోజు మరో 87 పరుగులు జోడించి మిగతా 6 వికెట్లూ కోల్పోయింది. దీంతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 123 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 346 పరుగులు చేసింది. అనంతరం కంగారులు తొలి ఇన్నింగ్స్ లో మార్ష్ సోదరుల శతకాల సాయంతో ఏకంగా 7 వికెట్లకు 649 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. 303 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ 180 పరుగులకే చెతులెత్తేసింది. కెప్టెన్ జో రూట్ మాత్రమే 58 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ 4 , లయన్ 3 వికెట్లు తీశారు. ఇంగ్లాండ్‌ను కప్పకూల్చిన కమిన్స్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ , కెప్టెన్‌ ఇన్నింగ్స్‌లతో ఆసీస్‌కు విజయాలను అందించిన స్మిత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ దక్కాయి.

Comments

comments