Thursday, April 25, 2024

కంగారూలదే బోణీ

- Advertisement -
- Advertisement -

Australia won 1 ODI against India

 

స్మిత్ విధ్వంసం, ఫించ్ శతకం, రాణించిన వార్నర్, హార్దిక్, ధావన్ శ్రమ వృథా, తొలి వన్డేలో భారత్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం

సిడ్నీ: భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 66 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 308 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.

శుభారంభం లభించినా..

క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్ శుభారంభం అందించారు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించారు. ఇటు మయాంక్ అటు ధావన్ దూకుడును ప్రదర్శించడంతో స్కోరు పరిగెత్తింది. వీరి విజృంభణతో భారత్‌కు మంచి ఆరంభమే లభించింది. కానీ రెండు ఫోర్లు, సిక్స్‌తో 22 పరుగులు చేసిన మయాంక్‌ను హాజిల్‌వుడ్ వెనక్కి పంపాడు. అప్పటికే ధావన్‌తో కలిసి 5.2 ఓవర్లలోనే 53 పరుగులు జోడించాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా దూకుడును ప్రదర్శించాడు. ధాటిగా ఆడిన కోహ్లి రెండు ఫోర్లు, సిక్స్‌తో 21 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఈ వికెట్ కూడా హాజిల్‌వుడ్‌కే దక్కింది. ఆ వెంటనే శ్రేయస్ అయ్యర్ (2) కూడా పెవిలియన్ చేరాడు. అతన్ని కూడా హాజిల్‌వుడ్ ఔట్ చేశాడు. మరోవైపు జట్టును ఆదుకుంటాడని భావించిన కెఎల్.రాహుల్ కూడా నిరాశ పరిచాడు. 12 పరుగులు మాత్రమే చేసి ఆడమ్ జంపా బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో భారత్ 101 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది.

ధావన్, హార్దిక్ పోరాటం

ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను ఓపెనర్ శిఖర్ ధావన్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తమపై వేసుకున్నారు. ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ ముందుకు సాగారు. హార్దిక్ తన ఐపిఎల్ ఫామ్‌ను ఈసారి కూడా కొనసాగించాడు. ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును పరిగెత్తించాడు. ధావన్ కూడా కీలక బ్యాటింగ్‌తో అలరించాడు. ఇద్దరు కుదురుగా ఆడడంతో భారత్ లక్షం దిశగా అడుగులు వేసింది. వీరి జోరును చూస్తుంటే భారత్ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. ఇదే క్రమంలో ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కు కీలకమైన 128 పరుగులు కూడా జోడించారు.

ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ఆడమ్ జంపా విడగొట్టాడు. పది ఫోర్లతో 74 పరుగులు చేసిన ధావన్‌ను అతను వెనక్కి పంపాడు. ఆ వెంటనే హార్దిక్ పాండ్య కూడా ఔటయ్యాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన హార్దిక్ 76 బంతుల్లోనే ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 90 పరుగులు చేసి జంపా బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. వీరిద్దరూ కొద్ది తేడాతో ఔట్ కావడంతో భారత్ పరాజయం ఖరారైంది. చివర్లో రవీంద్ర జడేజా (25), నవ్‌దీప్ సైని 29 (నాటౌట్) కాస్త పోరాడినా ఓటమిని మాత్రం తప్పించలేక పోయారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హాజిల్‌వుడ్ మూడు, జంపా నాలుగు వికెట్లు పడగొట్టారు.

వార్నర్, ఫించ్ జోరు

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు అరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్ మెరుపు ఆరంభాన్ని అందించారు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే అడపాదడపా ఫోర్లు కొడుతూ స్కోరు వేగం తగ్గకుండా చూశారు. ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇద్దరు అసాధారణ బ్యాటింగ్‌తో ముందుకు సాగారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన వార్నర్ ఆరు ఫోర్లతో 69 పరుగులు చేసి షమి బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇదే క్రమంలో తొలి వికెట్‌కు 156 పరుగులు జోడించాడు.

స్మిత్ విధ్వంసం..

వన్‌డౌన్‌లో వచ్చిన స్టీవ్ స్మిత్ అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. భారత బౌలర్లను హడలెత్తిస్తూ స్కోరును పరిగెత్తించాడు. ఫించ్ అతనికి అండగా నిలిచాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి పోయిన స్మిత్ వరుస ఫోర్లు, సిక్సర్లతో భారత బౌలర్లను చీల్చిచెండాడాడు. అతన్ని కట్టడి చేసేందుకు టీమిండియా బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇదే సమయంలో కెప్టెన్ ఫించ్‌తో కలిసి రెండో వికెట్‌కు 108 పరుగులు జోడించాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన ఫించ్ 9 ఫోర్లు, రెండు సిక్సర్లతో 114 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన స్టోయినిస్ (౦) ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. అయితే మాక్స్‌వెల్ విధ్వంసక బ్యాటింగ్‌తో భారత బౌలర్లను హడలెత్తించాడు. ఇటు స్మిత్, అటు మాక్స్‌వెల్ విజృంభించి ఆడడంతో స్కోరు వేగంగా పరిగెత్తింది. చెలరేగి ఆడిన మాక్స్‌వెల్ 19 బంతుల్లోనే మూడు సిక్సర్లు, మరో ఐదు ఫోర్లతో 45 పరుగులు చేశాడు. ఇక కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఆడిన స్మిత్ 66 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 105 పరుగులు సాధించాడు.

స్కోరు బోర్డు:

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ (సి) రాహుల్ (బి) షమి 69, అరోన్ ఫించ్ (సి) రాహుల్ (బి) బుమ్రా 114, స్టీవ్ స్మిత్ (బి) షమి 105, స్టోయినిస్ (సి) రాహుల్ (బి) చాహల్ 0, మాక్స్‌వెల్ (సి) జడేజా (బి) షమి 45, లబూషెన్ (సి) ధావన్ (బి) సైని 2, అలెక్స్ కెరీ (నాటౌట్) 17. కమిన్స్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు 21, మొత్తం 50 ఓవర్లలో 374/6.

బౌలింగ్: మహ్మద్ షమి 100593, బుమ్రా 100731, నవ్‌దీప్ సైని 100831, చాహల్ 100891, జడేజా 100630.

భారత్ ఇన్నింగ్స్: మయాంక్ అగర్వాల్ (సి) మాక్స్‌వెల్ (బి) హాజిల్‌వుడ్ 22, శిఖర్ ధావన్ (సి) స్టార్క్ (బి) జంపా 74, కోహ్లి (సి) ఫించ్ (బి) హాజిల్‌వుడ్ 21, శ్రేయస్ అయ్యర్ (సి) కెరీ (బి) హాజిల్‌వుడ్ 2, రాహుల్ (సి) స్మిత్ (బి) జంపా 12, హార్దిక్ పాండ్య (సి) స్టార్క్ (బి) జంపా 90, జడేజా (సి) స్టార్క్ (బి) జంపా 25, సైని (నాటౌట్) 29, షమి (బి) స్టార్క్ 13, బుమ్రా (నాటౌట్) 3, ఎక్స్‌ట్రాలు 20, మొత్తం 20 ఓవర్లలో 308/8.

బౌలింగ్: మిఛెల్ స్టార్క్ 90651, హాజిల్‌వుడ్ 100553, కమిన్స్ 80520, ఆడమ్ జంపా 100544, స్టోయినిస్ 6.20250, మాక్స్‌వెల్ 6.40550.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News