Search
Sunday 18 November 2018
  • :
  • :

మెరిసిన జొకోవిచ్, నాదల్, సెరెనా

ఆస్ట్రేలియా ఓపెన్  రెండో రోజు

tennisమెల్‌బోర్న్: ఆరుసార్లు ఛాంపియన్ అయిన సెర్బ్ టెన్నిస్ ఆటగాడు నోవాక్ జొకోవిచ్ మంగళవారం తన ఆరంభ మ్యాచ్‌లో స్పెయిన్‌కు చెందిన ఫెర్నాండో వెర్‌డాస్కోను ఓడించాడు. జొకోవిచ్ 2 గంటల 20 నిమిషాల పోరులో 6-1, 7-6(7/4), 6-2తో గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించా డు. తన రెండో రౌండోలో అతడు ఉజ్బెకిస్థాన్‌కు చెందిన డెనిస్ ఇస్టోమిన్ లేక క్రోయేసియాకు చెందిన ఇవాన్ డోడిగ్‌తో తలపడే అవకాశం ఉంది. రెండో గంటపాటు సాగిందని అయినా తాను మ్యాచ్‌పైనే దృష్టిపెట్టానని జొకోవిచ్ తెలిపాడు. రెండో సెట్ గాంబుల్‌లా అనిపించినా మొదటి, మూడో సెట్లు తనకు అనుకూలంగానే వచ్చాయని అన్నాడు. వెర్‌డాస్కో, జొకోవిచ్‌ను దాదాపు ఏడు ఏళ్లుగా ఓడించలేకపోతున్నాడు. ఇద్దరు ఆటగాళ్లు సర్వీస్ బ్రేకులు గేముల్లో తెగా ఆడారు. రెండో సెట్ టైబ్రేకర్ అయింది. అయినా జొకోవిచ్ 2-0 సెట్ల ఆధిక్యతతో విజయాన్ని సాధించాడు.
సెరెనా దూకుడు
సెరెనా విలియమ్స్ తన 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం ఉవిళ్లూరుతోంది. ఇందులో భాగంగానే ఆమె మంగళవారం ఆస్ట్రేలియా ఓపెన్‌లో స్విస్ టెన్ని స్ స్టార్ బెలిండా బెన్‌సిక్‌ను ఓడించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. అమెరికా టాప్ టెన్నిస్ క్రీడాకారిణి అయిన సెరెనా గత ఏడాది ఏంజెలిక్ కెర్బెర్ చేతిలో ఓడింది. ఈసారి సెరెనా 6-4, 6-3తో 19 ఏళ్ల బెలిండా బెన్‌సిక్‌ను చిత్తు చేసింది. స్టాండ్స్‌లో ఉన్న తన ప్రియుడు, రెడ్డిట్ సహ-వ్యవస్థాపకుడు అలెక్సిస్ ఒహానియన్ చూస్తుండడంతో మరింత పట్టుదలతో ఆడాలన్న ఆలోచనతోనే తానాడానని సెరెనా విలియమ్స్ తెలిపింది. రెండో సీడెడ్ అయిన సెరెనా, స్టెఫీ గ్రాఫ్ 22 గ్రాండ్‌స్లామ్ సింగిల్ టైటిల్స్ ఓపెన్ ఎరా-రికార్డును బద్ధలు చేయాలని చూస్తోంది. క్వార్టర్ ఫైనల్స్‌లో సెరెనా జొహన్నా కొంటా(బ్రిటన్), ఆరో సీడ్ డోమినికా సిబుల్కోవాతో తలపడే అవకాశం ఉంది.
నాదల్ ముందంజ
ఆస్ట్రేలియా ఓపెన్ పోటీలో మంగళవారం 14సార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియ న్, ప్రపంచ మాజీ నెం.1 అయిన స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ తన జోరు చూపించాడు. రెండు గంటలపాటు సాగిన గేమ్‌లో అతడు జర్మనీకి చెందిన ఫ్లోరియాన్ మేయర్‌ను 6-3, 6-4, 6-4తో వరుస సెట్లలో చిత్తు చేశాడు. గాయాలతో గత సంవత్సరం రాణించలేకపోయిన అతడు ఇప్పుడు పూర్ణ ఆరోగ్యంతో ఆడుతూ 49వ ర్యాంకరైన మేయర్‌ను చిత్తు చేశాడు. ఇక రెండోలోకి దూసుకెళ్ళిన నాదల్, సైప్రియట్ మార్కోస్ బాగ్దాటిస్‌తో తలపడనున్నాడు. 2009లో రోజర్ ఫెదరర్‌ను ఓడించి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను తొలిసారి గెలిచిన నాదల్ ఇప్పుడు రెండోసారి మళ్లీ ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ గెలవాలనుకుంటున్నాడు.

Comments

comments