Search
Saturday 22 September 2018
  • :
  • :

ఆస్ట్రేలియన్ ఓపెన్: సెరెనా సెన్సెషనల్ విక్టరీ

Serena-Williams

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్‌లో సెరెనా విలియమ్స్ విజయం సాధించింది. అక్క వీనస్ విలియమ్స్‌పై వరుస సెట్లలో 6-4, 6-4 తేడాతో సెన్సెషనల్  విక్టరీని అందుకుంది. దీంతో స్టెఫీగ్రాఫ్ పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్(23) రికార్డును సెరెనా బద్దలు కొట్టింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ ప్రారంభంలో సిస్టర్స్ ఒకరిని మించి మరోకరు తమ ప్రతిభపాటవాలను ప్రదర్శించారు. కానీ చివరికి చెల్లెలు సెరెనాకే విజయం వరించింది. నల్లకలువలు ఇలా ఫైనల్‌లో పోటీపడడం ఇది తొమ్మిదోసారి కావడం విశేషం.

Comments

comments