Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

ఆటో బోల్తా పడి నలుగురికి గాయాలు

Auto-accidentఆదిలాబాద్: దండేపల్లి మండలం మ్యాదరిపేట సమీపంలో బుధవారం రాత్రి ఆటో బోల్తా పడడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. మ్యాదరిపేట నుంచి లింగాపూర్ వైపు వెళ్తున్న ఆటో ముందు చక్రం ఊడిపోవడంతో ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఆటో డ్రైవర్ లచ్చు, ఆటోలో ఉన్న మల్లేష్, సూర్యలకు గాయాలయ్యాయి. మ్యాదరిపేట ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స జరిపి 108లో మంచిర్యాలకు తరలించారు. అలాగే చెన్నూర్ నుండి ఉట్నూర్‌కు మోటర్ సైకిల్ వెళ్తున్న గంగాసింగ్ అనే ఉపాధ్యాయుడు బుధవారం రాత్రి ప్రమాదావశాత్తు దండేపల్లి మండలం మ్యాదరిపేట బస్టాండ్ వద్ద కిందపడడంతో గాయాలయ్యాయి. మోటర్ సైకిల్‌కు ఎదురుగా శునకం రావడంతో ఒకే సారి బ్రేక్ వెయ్యడంతో మోటర్ సైకిల్ పై నుంచి కిందపడడంతో గంగాసింగ్‌కు గాయాలయ్యాయి.

Comments

comments