Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఆటో కారు ఢీ: నలుగురికి తీవ్ర గాయాలు

road-accident-image

కల్వకుర్తి: శ్రీశైలం హైదరాబాద్ రహదారి జేపినగర్ వద్ద సోమవారం సాయంత్రం ఆటో కారు ఢీకొన్న ఘటన లో నలుగురికి తీవ్రగాయాలై ఒకరి పరిస్థితి విషమంగా ఉన్న సంఘటన చోటు చేసుకుంది. ప్రత్యేక్ష సాక్షుల ప్రకారం… కల్వకుర్తి పట్టణం నుండి చారకొండకు ప్రయాణుకులతో వెళ్తున్న ఆటోను శ్రీశైలం నుండి హైదరాబాద్‌కు వస్తున్న కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మహిళలకు ఒక బాబుకు , మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయాలు అయిన వారిని 108 వాహనంలో కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. మరొక మహిళా తలకు తీవ్ర గాయం అయింది. పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్నమని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు  తెలిపారు.

Comments

comments