Search
Sunday 18 November 2018
  • :
  • :

కెసిఆర్ తో చైనా ప్రతినిధుల భేటీ…

CM KCR Review on Note for Vote Case

హైదరాబాద్: భాగ్యనగరాన్ని కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్నిప్రోత్సహిస్తామని సిఎం కెసిఆర్ అన్నారు. చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బివైడి ఆటో ఇండస్ట్రీ ప్రతినిధులు బుధవారం ప్రగతి భవన్ ముఖ్యమంత్రి కెసిఆర్ తో భేటీ అయ్యారు. 100 శాతం బ్యాటరీతోనే నడిచే వాహనాల తయారీ పరిశ్రమలను స్థానిక కంపెనీలతో కలిసి ఏర్పాటు చేస్తామని చైనా కంపెనీ ప్రతినిధులు సిఎం కు చెప్పారు. చైనా బయట పరిశ్రమలను ఏర్పాటు చేయడం ఇదే మొదటి సారని చైనా ప్రతినిధులు పేర్కొన్నారు. చైనా ప్రతినిధుల నిర్ణయం పట్ల సిఎం ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరుపున చైనా పరిశ్రమలకు పూర్తి సహకారం ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ…  హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తామని ఆయన చెప్పారు. ఆర్టిసి తో పాటు జిహెచ్ఎంసి లో క్రమక్రమంగా  ఎలక్ట్రిక్ వాహనాలను పెంచుతున్నాయని పేర్కొన్నారు. ప్రయివేట్ సంస్థలు సైతం ఎలక్ట్రిక్ వాహనాలక కోనుగోలు చేసే విధంగా ప్రభుత్వం తరుపున  అవగాహన కల్పిస్తామని తెలిపారు. నగరాలు, పట్టణాలలో వాహనాల ద్వారా పెరిగే కాలుష్యం దినదినం పెరుగుతుందన్నారు. కాలుష్యాన్ని నియంత్రించాలంటే ఎలక్ట్రిక్ వాహనాల వాడకం తప్పనిసరని సిఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచుతామని చైనా ప్రతినిధులతో చెప్పారు. ప్రథమ దశలోనే 500 వాహనాలు కొంటామన్నారు. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకానికి ఎక్కువ అవకాశం, అవసరం ఉందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

Comments

comments