Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

ఆటో బోల్తా : నలుగురి మృతి

Road accident

గుంటూరు : గురజాలలో ట్రాలీ ఆటో బోల్తా పడి నలుగురు చనిపోయారు. ఉప్పుచర్ల నుంచి గురజాలకు 30 మంది కూలీలతో బయల్దేరిన ట్రాలీ ఆటో గురజాల మండలం జంగమేశ్వరం చెరువు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో 15 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిని స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సందర్శించారు. గాయపడిన వారిని పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.25వేల చొప్పున వ్యక్తిగత ఆర్థికసాయం ప్రకటించారు.

Comments

comments