Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఆటో బోల్తా : మహిళ మృతి

Auto-Rollover

పశ్చిమగోదావరి : ఆటో బోల్తా పడిన ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన జంగారెడ్డిగూడెంలోని గోకులపారిజాతగిరిలో ఉన్న ఆలయం వద్ద గురువారం సాయంత్రం జరిగింది. అన్న ప్రసాద కార్యక్రమానికి వచ్చి తిరిగి వెళుతున్న సమయంలో ఏలూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతుల వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Auto Roll Over : woman died

Comments

comments