Home తాజా వార్తలు 25న ఆటోల బంద్

25న ఆటోల బంద్

Autos Bandhహైదరాబాద్ : తాము ఎదుర్కొంటున్న ధీర్ఘకాలిక సమస్యలను పరిష్కురించాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్లు ఈ నెల 25న రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు ఆటోల బంద్ కార్యక్రమం నిర్వహించున్నారు. ఆర్ టిఎ, ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్లను వేధిస్తున్నారని, ఈ వేధింపులను నిలిపివేసి ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్‌ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ మహ్మద్‌ అమానుల్లాఖాన్‌ డిమాండ్ చేశారు. పహాడి షరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆటో కిరాయి విషయంలో జరిగిన గొడవ ఆటో డ్రైవర్ సాయి నాథ్ హత్య గురయ్యాడు. ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. సాయి నాథ్ కుటుంబానికి ఆర్థిక సాయం చేసి, అండగా ఉంటామని ఆయన వెల్లడించారు.

Autos Bandh on June 25th In Telangana