Home తాజా వార్తలు విమానయానరంగం అభివృద్ధికి కృషి : కేంద్ర మంత్రి

విమానయానరంగం అభివృద్ధికి కృషి : కేంద్ర మంత్రి

ASHOK-G

ఢిల్లీ: దేశవ్యాప్తంగా విమానయానరంగం అభివృద్ధికి కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు తెలిపారు. ఈసమావేశంలో ఆయన మాట్లాడుతూ… రీజినల్ కనెక్టవిటీ స్కీం కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పౌరవిమానయాన శాఖల మధ్య ఒప్పందం కుదురిందన్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వంతో ఎంఒయు కుదుర్చుకున్నామని వెల్లడించారు. విమానయాన రంగంలో నైపుణ్యత కూడా చాలా అవసరముందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్రమంత్రి కెటిఆర్‌, పలువురు అధికారులు పాల్గొన్నారు.