Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

తాగితే రోగాలే

 Avoid sewage storage in the surrounding home

దేశమంతా స్వచ్ఛభారత్ అంటూ ముందుకు సాగుతుంటే జిల్లాలో మాత్రం వెనక్కి వెళ్తోంది. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున్న ప్రజలు ఇళ్ల పక్కన మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని వైద్యాధికారులు తెలియజేస్తు న్నారు. నీటినిల్వలతో దోమలకు ఆవాసాలుగా మారే ప్రమాదం ఉంది. మరోవైపు వర్షపునీటితో తాగు నీరు కలుషితం అవుతుండడంతో ప్రజలకు అతిసార, మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, టైఫాయిడ్, మెదడువాపు, వంటి విషజ్వరాలు వచ్చే అవకాశాలుండడంతో ప్రజలు సరైన జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి వ్యాధులు దరికి చేరవని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

మన తెలంగాణ / యాచారం రూరల్ :   సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసరాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని అధికారులు పదేపదే తెలుపుతున్నారు.  ప్రభుత్వ దవాఖానాల్లో ఇప్పటికే అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నందున ప్రజలు ప్రభుత్వ దవాఖానాల్లో చికిత్సలు చేయించుకోవాలని వైద్యాధికారులు తెలియజేస్తున్నారు  ముఖ్యంగా దో మలతో ఈ కాలంలో వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున దోమల నివారణ చర్యలు ప్రజలు తప్పనిసరిగా పాటించాలి. చిన్న జ్వరం వచ్చినా సరే వెంటనే వైద్యాధికారులను సంప్రదించి సరైన చికిత్సలు చేయించుకోవాలి. గ్రామాల్లో దోమలు విజృంభించకుండా గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో మురుగునీటి కాల్వలను శుభ్రం చేయడంతో పాటు దోమల నివారణ మందులను చల్లడం, పిచ్చిమొక్కలను తొలగించడం, శుద్ధమైన నీటిని సరఫరా చేయ డం వంటి పనులను పంచాయతీల ఆధ్వర్యంలో తప్పనిసరిగా చేయించాలి.

మలేరియా..
మలేరియా వచ్చిన వారికి రెండురోజులకు ఒక్కసారి చలిజ్వరంతో పాటు వాంతులతో కూడిన జ్వరం వస్తుంది. అదేవిధంగా శక్తి తగ్గిపోతుండటంతో పాటు చెమటలు పడటం వంటివి సంభవిస్తాయి.
తీసుకోవల్సిన జాగ్రత్తలు : ఇంటి ఆవరణ లో ఖాళీస్థలాల్లో నీటినిల్వ ఉండకుండా చూ సుకోవాలి, ఇండ్లలో దోమతెరలు ఖచితంగా వాడాలి. కాచిచల్లార్చిన నీటిని తాగాలి.
మెదడువాపు : పందులు, దోమల నుంచి వచ్చే వైరస్‌ద్వారా మెదడు వాపు వ్యాపిస్తుంది. జ్వరంతో కళ్లు తిరగడం, విపరీతమైన తలనొప్పి, నీరసంగా ఉండటం ఈ వ్యాది లక్షణాలు.
తీసుకోవల్సిన జాగ్రత్తలు : నివసించే ప్రాంతాలకు దూరంగా పందులు ఉండేలా చర్యలుతీసుకోవాలి. అదేవిధంగా పందులు సంచారం లేకుండా నిత్యం గ్రామపంచాయీ అధికారులు చర్యలు తీసుకోవాలి. దోమల నివారణ చర్యలు తప్పనిసరిగా పాటించాలి. దోమలు ఆవాసాలుగా ఏర్పర్చుకునే నీటినిల్వ గుంతలు, మురుగునీరు లేకుండా ఎప్పటికప్పుడు తొలగించాలి.
డెంగ్యూ : అకస్మాత్తుగా జ్వరం తీవ్రం కావడం, విపరీతమైన తలనొప్పి కండరాలు, కీళ్లు నొప్పులు రావడం, అలాగే, వాంతులు, నోరు ఎండిపోవడం, అదికదామం, శరీరంపై కురుపులతో పాటు రక్తపోటు నమోదుకావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
జాగ్రత్తలు : ప్రధానంగా దోమకాటుకు గురికాకుండా చూసుకోవాలి. ఇళ్లలో దోమతెరులు, కిటికీలకు సన్నని జాలి ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి పరసరాలతో పాటు చుట్టుపక్కల నీరునిల్వ ఉండకుండా చూడాఆలి. ఇంటి పరిసరాలోల వేసిటైర్లు, సీసాలు, పూలకుండీలలో, ఇతర సామాగ్రిలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అలా చేసినట్లయితే వర్షాకాలంలో వచ్చే వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.

Comments

comments