Home వార్తలు ఇలా వాడితే వాసన రాదు!

ఇలా వాడితే వాసన రాదు!

refrigeratorఇప్పుడు ప్రతీ ఇంట్లో ఫ్రిజ్ ఉంటోంది. అయితే దాని వాడకంలో కొన్ని చిట్కాలు పాటిస్తే మంచిది.ఫ్రిజ్ కెపాసిటీని బట్టి అందులో పదార్థాలని పెట్టండి. గిన్నె మీద గిన్నె పెట్టి కూరడం వల్ల పదార్థాలు అంత తాజాగా ఉండవు. ఫ్రిజ్ నుంచి త్వరగా చెడు వాసన వచ్చేస్తుంది.
పండ్లూ, కూరగాయలను నెట్ బ్యాగ్‌లూ, పల్చని ప్లాస్టిక్ సంచుల్లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
కూరగాయలూ, పండ్లూ ఒకచోట కలిపి పెట్టకుండా వేర్వేరు అరల్లో ఉంచాలి. వేడి పదార్థాలు చల్లారిన తరువాతే ఫ్రిజ్‌లో పెట్టాలి.
ఫ్రిజ్ ఐదు డిగ్రీల సింటిగ్రేడ్ దగ్గర, డీప్‌ప్రిజర్ మైనస్ పద్దెనిమిది డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర లేదా అంతకన్నా తక్కువ ఉండాలి. ధర్మామీటర్‌తో అప్పుడప్పుడు ఈ ఉష్ణోగ్రతలను కాలవాలి.