Home తాజా వార్తలు పట్టు రైతులకు అవగాహన సదస్సు

పట్టు రైతులకు అవగాహన సదస్సు

Jupally Krishna rao says Panchayat elections will complete within time

హైదరాబాద్: నాంపల్లి ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో పట్టు రైతులకు అవగాహన సదస్సును మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా పట్టుకు డియాండ్ పెరిగిందని, పట్టు పరిశ్రమ ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి జూపల్లి అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత సాగునీటి వనరులు పెరిగాయని, 100 శాతం ఉచితంగా షెడ్డు, మొక్కలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎకరా మల్బరీ సాగు ద్వారా ఏడాదికి 8 పంటలతో నాలుగు లక్షల రూపాయలు ఆదాయంగా పొందవచ్చిన తెలిపారు. మల్బరీ, టస్సార్‌లో తెలంగాణ మొదటి స్తానంలో ఉండేలా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు.