Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన

రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన

TRAFIC

మనతెలంగాణ/శామీర్‌పేట రూరల్: రోడ్డు భద్రతపై నియమ నిబందనలను ప్రతి ఒక్కరు తప్పని సరి పాటించాలని శామీర్‌పేట ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. మండలంలోని లాల్‌గడి మలక్‌పేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో మాన్ శాంటో ఆధ్వరయలో రోడ్డు భద్రత పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతను పాటించి తగిన జాగ్రతలు తీసుకొంటే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు. విద్యార్థులు వాటిపై ఇప్పటి నుంచే అవగాహన కలిగి ఉండాలన్నారు. రోడ్డు పై వెల్లే టప్పుడు నియమ నిబందనలు పాటించాలన్నారు. విద్యార్థులకు డిజిటల్ విడియో చిత్రాలను చూపుతు అవగాహన పర్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్, మాన్ శాంటో అధికారులు, ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.