Home ఖమ్మం వర్షాల పట్ల అప్రమత్తత అవసరం

వర్షాల పట్ల అప్రమత్తత అవసరం

collctrateప్రజలకు అందుబాటులో ఉండండి
ప్రత్యామ్నాయ చర్యలపై శ్రద్ధ పెట్టండి
వర్షాలపై సమీక్షలో అధికారులకు మంత్రి ఆదేశాలు
ఎప్పటికప్పుడు నివేదికలు పంపండి : కలెక్టర్ లోకేష్ కుమార్

ఖమ్మం కలెక్టరేట్: వర్షాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని రోడ్లు భవనాలు, స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి తు మ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించా రు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండా లని చెప్పారు. శనివారం నగరంలోని టీటీ డీసీ లో వర్షాలపై కలెక్టర్‌తో కలిసి మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా తుమ్మల మాట్లాడుతూ… మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ అధికారులు హెడ్ క్వార్టర్స్‌ను వదిలి వెళ్లకూడదని చెప్పారు. వర్షా ల నేథప్యంలో ఏమైనా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటే వెంటనే తాత్కాలిక ఏర్పాట్లు చేయాలన్నారు. ఏదైన అవసరం అనుకుంటే కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చి సమస్య పరిష్కారినికి కృషి చేయాలని చెప్పారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, జాతీయ రహదారులు వరద వలన కలిగిన నష్టాన్ని వెంటనే మరమ్మతు చేయాలని సూచించారు. కోదాడ నుంచి ఖమ్మం వరకూ రోడ్లు గుంతలు పడినందున వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని ఎన్‌హెచ్ ఈఈని ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతంలో రోడ్లపై వరద ఉధృతి ప్రవహిస్తున్నందున వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేసి ప్రజలకు రవాణా ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. పాలేరు రిజర్వాయర్ ఇన్‌ఫ్లో ప్రకారం నీటి విడుదల సందర్భంగా వైరా, కల్లూరు, మధిర ప్రాంతంలో ఏ చెరువైతే నిడలేదో వాటిని నింపేందుకు కిందిస్థాయి అధికారులను అప్రమత్తం చేయాలని ఆదే శించారు. వృథాగా పోనివ్వకుండా చెరువులను నింపితే ఆ ప్రాంత రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. నీటి విడుదల సంద ర్భంలో సంబంధిత డిప్యూటీ ఈఈలు అప్రమత్తం చేయా లన్నారు. వర్షాలు ఈనెల 28 వరకూ వచ్చే అవకాశమున్నందున పాఠశాల భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆస్పత్రులు, ఇతర ప్రభుత్వ భవనాలు ప్రమాదాలు, నష్టం జరగకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
నివేదికలు పంపండి : కలెక్టర్
వర్షాలు ఆగకుండా కురుస్తున్నందన అధికారులు రోజుకు రెండుసార్లు నివేదికలు పంపాలని కలెక్టర్ డీఎస్ లోకేష్ కుమార్ సూచించారు. గృహాలు కూలిన పక్షంలో ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం పరిహారం అందించాలన్నారు. జిల్లాలో వర్షం వలన కలిగిన నష్టాన్ని కలెక్టర్ వివరించారు. 41 చేతిపంపులు, 60 కల్వర్టులు, ఖమ్మం నుంచి సత్తుపల్లి వరకూ 60 కిలోమీటర్లు రోడ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. వీటి తక్షణ మరమ్మతుకు రూ.1.11 కోట్లు, శాశ్వతంగా పనుల కోసం రూ.30 కోట్లు అవసరం ఉంటుందని పేర్కొన్నారు. పంటలకు సైతం తీరనినష్టం వాటిల్లిందని చెప్పారు. వర్షాలు ఆగినవెంటనే మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రభలకుండా జాగ్రత్తలు చేపడతామని తెలిపారు. సమావేశంలో డీఆర్‌ఓ శ్రీనివాస్, సీపీఓ జడ్.రాందాస్ తదితరులు పాల్గొన్నారు.