Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

టిఆర్‌ఎస్ పార్టీకి బుద్ధి చెప్పడానికే ప్రజా చైతన్య యాత్ర

uttam1

* వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే కేసిఆర్ నాటకం
* రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం ఖాయం

మన తెలంగాణ/నిర్మల్:   టిఆర్‌ఎస్ పార్టీకి బుద్ధిచెప్పడానికే ఈ ప్రజా చైతన్య యాత్రఅని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తంకుమార్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌పార్టీ చేపట్టిన ప్రజాచైతన్య యాత్ర మంగళవారం నిర్మల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక ఎన్‌టిఆర్ మినీ స్టేడియంలో ఏర్పా టు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. వైఫల్యాలను కప్పిప్పుచ్చేందుకే కేసిఆర్ కొత్త నాటకం తెరమీదికి తీసుకువస్తున్నారన్నారు. ఎన్ని కూటమిలు వచ్చినా వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేంద్రంలో పాగావేయడం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. డిసెంబర్‌లోనే ఎమ్మెల్యే, ఎంపి ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నట్లు తమకు సంకేతాలు ఉన్నాయన్నారు. నాలుగు సంవత్స రా ల నుండి రైతులపై కానరాని ప్రేమ ఎన్నికలు దగ్గర పడడంతో ఇప్పుడు రైతు పథకాలు ప్రారం భిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన బడ్జేట్‌లో రైతులకు చేసిందేమిలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో కి వస్తే రైతులకు ఏకకాలంలో రెండు లక్షలరుణమాఫీ చేస్తామన్నారు. రైతు పం డించే ప్రతీ పంటకు మద్దతు ధర ప్రకటిస్తామన్నారు.రాష్ట్రంలో 6లక్షల స్వయం సహా యాక మహిళ సంఘాలు ఉన్నాయన్నారు.వాటిని టిఆర్‌ఎస్ ప్రభుత్వం నిరుగారు స్తుందన్నారు. అభయహస్తం పథకాన్ని కేసిఆర్ ప్రభు త్వం రద్దుచేసిందన్నారు.మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధా లుగా ఆర్థిక ప్రోత్సాహాలుఅందిస్తామన్నారు.మహిళ సంఘాలకు అభయ హస్తం పింఛన్ కిందవెయ్యిరూపాయలు అందిస్తామన్నారు.బ్యాంక్ రుణాల ను రూ.10లక్షల వరకు వడ్డీ లేకుండా అందిస్తామన్నారు.కాంట్రాక్ట్ ఉద్యో గు లను రెగ్యులర్ చేస్తామన్నారు. ఉద్యో గం రాని నిరుద్యోగులకు రూ.3 వేల చొప్పున నిరుదోగ్యం కిందఅందిస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో టిసిసి అధ్యక్షులుఉత్తంకుమార్‌రెడ్డి,జానారెడ్డి, షబ్బీర్‌అలీ,సబితఇంద్రరెడ్డి, విహెచ్ హన్మంత్‌రావు,శ్రీధర్‌బాబు,దానంనాగేందర్, మల్లురవి, అజారొద్ది న్, ఆకు ల లలీత,రాంమోహన్‌రెడ్డి,రాంచదందర్‌రెడ్డి,బలరాంనాయక్, భార్గవ్ దేశ్ పాండే,ఆత్రంసక్కు,హరినాయక్,అనిల్‌జాద్,రాంరావుపటేల్  పాల్గొన్నారు.

Comments

comments