Home జోగులాంబ గద్వాల్ వదంతులపై ప్రత్యేక నిఘా

వదంతులపై ప్రత్యేక నిఘా

Awareness programs throughout the district

జిల్లా అంతటా అవగాహన కార్యక్రమాలు
గద్వాల జిల్లా ఎస్‌పి రేమారాజేశ్వరి

మనతెలంగాణ/గద్వాల న్యూటౌన్: జిల్లాలో పది పదిహేను రోజుల నుంచి పిల్లలను ఎత్తుకెళ్లే ముఠా తిరుగుతోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బీహర్ నుంచి ఓ ముఠా దిగిందని గుంపులుగా తిరుగుతూ పిల్లలను కిడ్నాప్ చేస్తు న్నారని విపరీత ప్రచారం జరిగింది. ఈ వదంతులు జనాలను ముఖ్యంగా మహిళలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. వాట్సప్‌లో వస్తున్న పోస్టింగ్‌ల కారణంగా తెలియని వాళ్ళు భయపడి పోతున్నారు. చదువుకున్న వారు, ఉద్యో గులు కూడ వాటిని నమ్ముతూ భయానికి లోనవుతన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు అలాంటి సంఘటనలు చోటుచేసుకోలేదు. పుకార్లు పై ప్రజలను చైతన్య పరుటకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్‌ల ఎస్ హెచ్ ఒ మరియు విసిఒలు జిల్లా ఎస్పీ రేమారాజేశ్వరి అదేశాల మేరకు  గ్రామాలల్లో వాట్సప్ పుకార్లపై వదంతులు నమ్మవద్దని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పట్టణంలో బ్లూ కోల్ట్ వాహనాలు అంతటా నిరంతరం నిఘా ఉంచి గస్తీ నిర్వహిస్తున్నారు. గ్రామ లల్లో ఆటో సౌండు ద్వారా ఆర్థిక  నేరాలపై పుకార్లపై అవగాహన కల్పించబడుతుంది