Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

యాక్సిస్ లాభం రూ.701 కోట్లు

axis

ముంబై: జూన్ 31 ముగింపునాటి తొలి త్రైమాసిక ఫలితాల్లో ప్రైవేటురంగానికి చెందిన యాక్సిస్ బ్యాంక్ నికర లాభం రూ.701.09 కోట్లు నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో రూ.1,305.60 కోట్లతో పోలిస్తే ఈ సారి లాభం 46 శాతం క్షీణించింది. విశ్లేషకుల ప్రకారం, జూన్ త్రైమాసికంలో బ్యాంక్ రూ.600 కోట్ల నికర లాభం ఆర్జిస్తుందని అంచనా.. దీనిని ఈసారి బ్యాంక్ చేరుకుంది. దేశీయ మూడో అతిపెద్ద ప్రైవేటురంగ బ్యాంక్ యాక్సిస్ వడ్డీ నుంచి లబ్ధిని పొందింది. గతేడాదితో పో లిస్తే రుణాఐలు 14 శాతం వృద్ధిని సాధించింది. నాలుగో త్రైమాసికంలో మొత్తం రుణాలు 6.77 శాతం నుంచి 6.52 శాతానికి తగ్గాయి. కేటాయింపులు 2018 క్యూ1(ఏప్రిల్‌జూన్)లో రూ.3,337 కోట్లతో 43 శాతం పెరిగాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో కేటాయింపులు రూ.2,341 కోట్లుగా ఉన్నాయి. అయితే త్రైమాసికంత్రైమాసికం చూస్తే ఈ కేటాయింపులు 54 శా తం క్షీణించాయి. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం రూ. 4,616 కోట్ల నుంచి రూ. 5,166 కోట్లతో 12 శాతం పెరిగింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌పై యాక్సిస్ బ్యాంక్ షేరు విలువ 3శాతం పెరిగి 569 రూపాయల వద్ద స్థిరపడింది.
పడిపోయిన ఇండిగో లాభాలు

plane
క్యూ1(ఏప్రిల్‌జూన్) ఫలితాల్లో ప్రైవేటు విమానయాన సంస్థ ఇండిగో లాభాలు దారుణంగా పడిపోయాయి. నికర లాభం 97 శాతం క్షీణించి రూ.27 కోట్లు మాత్రమే నమోదు చేయగా, గతేడాది ఇదే సమయంలో లాభం రూ.811 కోట్లుగా ఉంది. ప్రతి త్రైమాసికంలోనూ మంచి లాభాలను నమోదు చేస్తున్న సంస్థ ఈసారి చతికిలబడింది. విదేశీ మారకం, అధిక ఇంధన ధరలు సంస్థ తొలి త్రైమాసిక ఫలితాలను బాగా దెబ్బ తీసాయి. ఈ త్రైమాసికంలో అమ్మకాలు పుంజుకున్నాయి. 13.2 శాతం వృద్ధితో రూ .6.51 బిలియన్లకు చేరుకున్నాయి. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో 5.75 బిలియన్ డాలర్ల అమ్మకాలు జరిగాయి. ఇండిగో వివిధ ప్రతికూల అంశాలకారణంగా తాజా త్రైమాసికంలో భారీగా నష్టపోయింది. విదేశీ మారకం, అధిక ఇంధన ధరలతోపాటు, మార్కెట్‌లో నెలకొన్న పోటీ కారణంగా లాభాలు క్షీణించినట్టు సంస్థ వెల్లడించింది. ఇండిగో సహ వ్యవస్థాపకుడు రాహుల్ భాటియా మాట్లాడుతూ, ఈ త్రైమాసికంలో ప్రతికూల పరిస్తితులను ఎదుర్కొంటున్నప్పటికీ, దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని అన్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సేవలను విస్తరిస్తున్నామని తెలిపారు.
మరోసారి దుమ్మురేపిన డీమార్ట్

dmart
డీమార్ట్‌ను నడుపుతున్న అవెన్యూ సూపర్ మా ర్ట్ క్యూ1 ఫలితాల్లో మరోసారి దుమ్ము రే పింది. విశ్లేషకుల అంచనాలను అధిగమించి అందరినీ ఆశ్చర్యపరిచింది. గత ఏడాదితో పోలిస్తే డీమార్ట్ లాభం దాదాపు 100కోట్ల మేర పుంజుకుంది. ఈ త్రైమాసికంలో నికరలాభం 43 శాతం పెరిగి రూ.251 కోట్లకు చేరగా, గతేడాది ఇదే సమయంలో రూ.175 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. కంపెనీ రెవెన్యూ 27శాతం పుంజుకుని రూ.4,559 కోట్ల ఆదాయాన్ని సంస్థ ఆర్జించింది. గతేడాది ఇది రూ. 3,598గా ఉంది. ఇది సుమారు రూ.251 కోట్ల నెట్ ప్రాఫిట్‌ను సంస్థ ఆర్జించింది. రూ.423 కోట్లుగా నమోదైంది. ఎబి టా మార్జిన్లు కూడా గత ఏడాది 8.4 శాతం నుంచి కూ డా 9.3 శాతానికి పుంజుకున్నాయి. నేషనల్ స్టాక్ ఎ క్సేంజ్‌పై అవెన్యూ సూపర్‌మార్ట్ షేరు విలువ 2 శాతం పెరిగి రూ.1,598 వద్ద స్థిరపడింది.

హెచ్‌డిఎఫ్‌సి లాభం అదుర్స్

hdfc

హౌసింగ్ డెవలప్‌మెం ట్ ఫైనాన్స్ కార్పొరేషన్(హెచ్‌డిఎఫ్‌సి) క్యూ1(ఏప్రిల్‌జూన్) ఫలితాల్లో అద్భుతం గా రాణించింది. సంస్థ నికర లాభం 54 శాతం వృ ద్ధితో రూ.2,190 కోట్లను ఆర్జించింది. గతేడాది ఇదే సమయంలో ఈ లాభం రూ.1424.47 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం(స్టాండలోన్) 20 శాతం పెరిగి రూ. 9,952 కోట్లు నమోదు చేయగా, గతేడాది ఇదే సమయంలో ఆదాయం రూ.8,289 కోట్లు మాత్రమే ఉం ది. కన్సాలిడేటెడ్ గణాంకాలను కంపెనీ వెల్లడించలే దు. ఆపరేషన్ల నుంచి రెవెన్యూ రూ.8,259 కోట్ల నుం చి రూ.9,883 కోట్లకు పెరిగింది. రూ.35 వేల కోట్ల వరకు బాండ్లను జారీ చేసేందుకు సోమవారం కంపెనీ బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌పై హెచ్‌డిఎఫ్‌సి షేరు విలువ 1.53 శాతం తగ్గి రూ.2,016కు చేరింది.

Comments

comments