Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

ఆయుర్వేదంతో సంపూర్ణ ఆరోగ్యం

Laxma-Reddy-హైదరాబాద్ : ఆయుర్వేదతో సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఆయుర్వేద ఔషధాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఆయన పేర్కొన్నారు. పంజాగుట్ట ద్వారకాపూరి కాలనీలో గురువారం అమృతం ఆయుర్వేదం బజార్‌తో పాటు అమృతం ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఆయుర్వేదం ప్రకృతి సిద్ధ వైద్యమని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆయుర్వేద వైద్య విధానాన్ని గుర్తించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమృతం ఆస్పత్రి ఎండి డాక్టర్ సుబ్రమణ్యం, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Comments

comments