Search
Friday 16 November 2018
  • :
  • :

ప్రేమను చూసే విధానం మారాలి

sneha

చరణ్‌తేజ్ హీరోగా స్వీయ దర్శకత్వంలో… త్రినాథరావు నక్కిన కథ, దర్శకత్వ పర్యవేక్షణలో, మారుతి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం ‘ఆయుష్మాన్‌భవ’. స్నేహా ఉల్లాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సిటిఎఫ్ నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తోంది. ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ కథనంతో రూపొందుతున్న ఈ చిత్రానికి బాలీవుడ్‌కు చెందిన మీట్ బ్రోస్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. సమాజం ప్రేమను చూసే పద్ధతి మారాలి అనే కమర్షియల్ పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. నవంబర్ 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు చరణ్‌తేజ్ మాట్లాడుతూ “స్నేహా ఉల్లాల్ పాత్ర సినిమాకు హైలైట్‌గా ఉంటుంది. ప్రేమించిన అమ్మాయి కులం, మతం వేరేతై మర్చిపోవాలా, పారిపోవాలా, చచ్చిపోవాలా… ప్రపంచం ఏమైతే నాకేంటి సమాజం ప్రేమను చూసే విధానం మారాలి లేకపోతే చంపేస్తా… అనుకునే హీరో క్యారెక్టరైజేషన్‌తో ఈ చిత్రం తెరకెక్కింది”అని అన్నారు. హుజన్, పరుచూరి వెంకటేశ్వరరావు, రంగరాజన్, అశ్విన్, నిఖిత తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః దాశరథి శివేంద్ర, ఆర్ట్‌ః పి.ఎస్.వర్మ, కథనంః పరుచూరి బ్రదర్స్.

Comments

comments