Home జాతీయ వార్తలు ఆయుత మహాచండీ యాగం ప్రారంభం

ఆయుత మహాచండీ యాగం ప్రారంభం

MAHA-CHANDIమెదక్ : లోక కల్యాణం కోసం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో తెలంగాణ సిఎం కెసిఆర్ తలపెట్టిన ఆయుత మహా చండీయాగానికి బుధవారం ఉదయం శ్రీకారం చుట్టారు. తొలుత రుత్విజులతో కలిసి సిఎం కెసిఆర్ దంపతులు యాగశాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. నేటి నుంచి ఐదు రోజుల పాటు ఈ యాగం జరగనుంది. శృంగేరి పీఠం ఆధ్వర్యంలో, అక్కడి నుంచి వచ్చిన ఆరుగురు ప్రధాన రుత్విజుల పర్యవేక్షణలో , రెండు వేల మందికి పైగా రాష్ట్ర, పొరుగు రాష్ట్రాల రుత్విజుల సమక్షంలో ఈ యాగం జరుగుతుంది. 108 హోమగుండాలతో పాటు చతుర్వేద యాగశాలల్లో రాజశ్యామల, మహారుద్ర, ఆయుత మహా చండీ యాగం జరగనుంది. ఆయుత మహా చండీయాగంలో భాగంగా మొదటి రోజైన నేడు వెయ్యి చండీ పారాయణాలుఏ, 40 లక్షల నవార్ణమంత్ర జపాలు చేయనున్నారు.
మహాచండీ యాగంతో ఎర్రవల్లిలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. యాగంతో ఈ ప్రాంతం సందడి సందడిగా మారింది. యాగశాల వద్ద నాలుగు వేల మంది తిలకించే విధంగా ఏర్పాట్లు చేశారు. రోజూ 50 వేల మందికి అన్నదానం చేసే విధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. సుమారు 3,300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. యాగశాల చుట్టూ ఐదు కిలోమీటర్ల మేర వరకు సిసి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.