Search
Tuesday 20 November 2018
  • :
  • :

సికింద్రాబాద్ నుంచి అజర్ పోటీ?

మనసులో మాటను బైటపెట్టిన మాజీ క్రికెటర్

Two Players Remove From India Team Said by Mohammad Azharuddin

న్యూఢిల్లీ:  గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లనుంచి పోటీ చేసిన కాంగ్రెస్ నాయకుడు, మాజీ క్రికెటర్ అజరుద్దీన్ వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో తన సొంతరాష్ట్రంలోని పికిందరాబాద్ నియోజకవర్గంనుంచి పోటీ చేయలని అనుకుంటున్నారు. పిటిఐకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో అజరుద్దీన్ తన మనసులోని మాటను బైటపెట్టారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నియోజకవర్గంనుంచి పోటీ చేసి గెలుపొందిన అజరుద్దీన్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్‌లోని టోంక్‌సవాయి మాధేపూర్‌నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈ సారి మాత్రం తాను తన సొంత రాష్ట్రమైన తెలంగాణలోని సికిందరాబాద్‌నుంచి పోటీ చేయాలని ఉందని ఆయన చెప్పారు. అయితే పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకే తాను సికిందరాబాద్‌నుంచి పోటీ చేయాలా వద్దా అపేది ఆధారపడి ఉంటుందని చెప్పారు. తాను సికిందరాబాద్‌నుంచి పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని అజర్ చెప్పారు. నియోజకవర్గంలోని చాలామంది తాను ఆక్కడినుంచే పోటీ చేయడాన్ని స్వాగతించారని అన్నారు. ఇదే విషయాన్ని తాను పార్టీ అధిష్ఠానానికి, పార్టీ ఇన్‌చార్జికి తెలియజేశానని కూడా ఆయన చెప్పారు. సికిందరాబాద్‌నుంచి గెలుస్తారని అనుకుంటున్నారా? అని అడగ్గా, గెలుపు ఓటముల గురించి తాను ఆలోచించడం లేదని, ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు అజర్ చెప్పారు.

Comments

comments