Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

ప్రపంచ టాప్-20 దాతల్లో ప్రేమ్‌జీకి నాలుగో స్థానం

Azim-Premjiముంబయి: ప్రపంచంలోని అత్యంత ఉదారత కల్గిన 20 మంది జాబితాలో విప్రో చైర్మన్ అజిమ్ ప్రేమ్‌జీ నాలుగో స్థానం దక్కించుకున్నారు. ఉదార స్వభా వం కల్గిన ప్రముఖులపై వెల్త్ కన్సల్టెన్సీ వెల్త్-ఎక్స్, బిజినెస్ ఇన్‌సైడర్ అధ్యయ నం నిర్వహించాయి. ప్రపంచంలోనే అత్యంత దాతృత్వం చేసినవారి జాబితా లో మొదటి స్థానంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, రెండో స్థానంలో బర్క్‌షైర్ హాత్‌వే సిఇఒ వారెన్ బఫెట్‌లు ఉన్నారు. దాతలు ప్రధానంగా విద్యా కార్యక్రమాలపై దృష్టిని కేంద్రీకరించారని, వారి ఫౌండేషన్ ద్వారా విరాళాలు అందిస్తున్నారని నివేదిక తెలిపింది. 20 మంది దాతల్లో 18మంది విద్యకే ప్రాధాన్యత ఇచ్చారని సంస్థ వివరించింది. మూడో ర్యాంకును సొరోస్ ఫండ్ మేనేజ్‌మెంట్ వ్యవస్థాపకుడు జార్జి సొరోస్ పొందగా, నాలుగో స్థానంలో భారతీయు డైన అజీమ్ ప్రేమ్‌జీ నిలిచారు.

2015 అక్టోబర్ నాటికి జీవితకాల విరాళాలను చూస్తే ప్రేమ్‌జీ 8 బిలియన్ డాలర్లు (రూ.53,360 కోట్లు), అలాగే బిల్ గేట్స్ 27 బిలియన్ డాలర్లు (రూ.1,80,090 కోట్లు) విరాళంగా ఇచ్చారని నివేదిక పేర్కొంది. టాప్-20 దాతలు మొత్తంగా 106.8 బిలియన్ డాలర్లు (రూ.71,23, 56 కోట్లు) విరాళమిచ్చారు. అధ్యయనం ప్రకారం, జాబి తాలో తొలి పది మంది లో బిల్ గేట్స్ (జీవితకాల విరాళం 27 బిలియ న్ డాలర్లు), వారెన్ బఫెట్ (21.5 బిలియన్ డాలర్లు), సొరోస్ ఫండ్ మేనేజ్‌మెంట్ వ్యవ స్థాకుడు జార్జ్ సొరోస్ (8 బిలియన్ డాలర్లు), అజి మ్ ప్రేమ్‌జీ (8 బిలియన్ డాలర్లు), డ్యూటీ ఫ్రీ షాపర్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు చార్లెస్ ఫ్రాన్సిస్ (6.3 బిలియన్ డాలర్లు), అల్ రజి బ్యాంక్ సహ వ్యవ స్థాపకుడు సులైమాన్ బిన్ అబ్దుల్ అజిజ్(5.7 బిలి యన్ డాలర్లు), ఇంటెల్ సహ వ్యవస్థాపకుడు గోర్డాన్ మూర్ (5 బిలియన్ డాలర్లు), మెక్సికన్ టెలికామ్ దిగ్గజం కార్లోస్ స్లిమ్ హెలు, కెబి హోమ్ సహ వ్యవస్థాపకుడు ఎలి బ్రాడ్ (3.3 బిలియన్ డాలర్లు), బిఒకె ఫైనాన్షియ ల్ కార్పొరేషన్ చైర్మన్ జార్జ్ కైసర్ (3.3 బిలియన్ డాలర్లు) ఉన్నారు

Comments

comments