Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

పుకార్లు నమ్మొద్దు

విప్రోలో కొన్ని యూనిట్ల విక్రయం వార్తలను ఖండించిన కంపెనీ చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ
premjiబెంగళూరు : కంపెనీని విక్రయిస్తున్నట్టు వచ్చిన వా ర్తలను ఐటి దిగ్గజం విప్రో ఖండించింది. కంపెనీకి చెం దిన కొన్ని యూనిట్లను విక్రయించడానికి ఇన్వెస్ట్‌మెం ట్ బ్యాంక్‌లను సంప్రదించారని సీనియర్ బ్యాంకింగ్ వర్గాలు చెప్పినట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలను నిరాధారమైనవి, అవాస్తవమైనవని విప్రో తోసిపుచ్చింది. ఈమేరకు సోమవారం రాత్రి ఉద్యోగుల కు కంపెనీ ప్రమోటర్, చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ లేఖ రాశారు. వెజిటబుల్ ఆయిల్స్‌లో చిన్న ప్రాంతీయ సంస్థ నుంచి టెక్నాలజీలో అంతర్జాతీయ దిగ్గజంగా ఎదిగిన విప్రోను తాను గత 50 ఏళ్లుగా చూస్తున్నానని, ఇదే విశ్వాసంతో ముందుకు సాగుతామని ప్రేమ్‌జీ లేఖలో పేర్కొన్నారు. ఎంతో సమర్థవంతమైన ఐటి పరి శ్రమ, విప్రో సంస్థలో ఎంతో ఆనందంగా కొనసాగుతు న్నాను.. తమ క్లయింట్లు, కంపెనీ విజయం కోసం కంపెనీలో ఎంతో శక్తివంతంగా కృషి చేస్తారని, దీనికి ఎప్పటిలాగానే విప్రో కట్టుబడి ఉందని అజీమ్ చెప్పా రు. మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవాలనీ, నిరా ధారమైన ఇలాంటి పుకార్లను నమ్మవద్దంటూ లేఖలో ప్రేమ్‌జీ ఉద్యోగులను కోరారు.
ఆందోళనలు తొలగించే పనిలో..
ఉద్యోగాల కోతలపై ఆందోళనలను తొలగించేందుకు ఐటి కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ ఉద్యో గులకు వేతనాలు పెంచామని, పెంచిన వేతనాలు జూ న్ నుంచే అమలవుతాయని విప్రో ప్రకటించింది. అదే సమయంలో ఈ సంవత్సరం ఏ ఉద్యోగినీ తొలగించబో వడం లేదని ఇన్ఫోసిస్ పేర్కొంది. ఉద్యోగులకు 10 శాతానికి లోపుగానే ఇంక్రిమెంట్ ఉంటుందని, ఇక విదేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వారివారి ప్రాంతా ల ఆధారంగా జీతాలను పెంచామని విప్రో వెల్లడించిం ది. పనితీరులో ప్రతిభను కనబరిచిన వారికి రివార్డులు సైతం ఇవ్వనున్నామని విప్రో పేర్కొంది. ఇదే సమ యంలో ఉద్యోగులను తొలగించబోవడం లేదని చెప్పిన ఇన్ఫోసిస్, వేతనాల పెంపును వచ్చే నెల నుంచి అమలు చేయనున్నట్టు తెలిపింది.

Comments

comments