Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

బ్లాక్‌మెయిల్ తో ఆత్మహత్యాయత్నం.. రమ్య మృతి

Young Girl Sucide Attempted In Nizamababd

నిజామాబాద్: చదువుకుంటున్న తనతో చనువుగా ఉన్న వ్యక్తి నయవంచకుడిగా మారాడంతో గత నెల 28న కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బీటెక్ విద్యార్థిని రమ్యకృష్ణ చికిత్స పొందుతూ చనిపోయింది. 90 శాతం కాలిన గాయాలతో గత ఆరు రోజులుగా మృత్యువుతో పోరాడిన ఆమె శనివారం ఉదయం మృతిచెందింది. గతంలో సన్నిహితంగా ఉన్న ఫొటోలు ఇంటర్నెట్‌లో పెడతానని ఓ వ్యక్తి బెదిరించడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. మూడేళ్ల క్రితం మత్తుమందు ఇచ్చి లోబర్చుకొని అసభ్యకరమైన చిత్రాలను చిత్రీకరించాడు. వీటిని బూచీగా చూపి రమ్యకృష్ణను వేధించడం మొదలుపెట్టాడు. అప్పటికే ప్రసాద్‌కు పెళ్లి అవ్వగా వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూ మూడేళ్ల పాటు నయవంచనతో ప్రేమాయణం సాగించాడు. ఇటీవల తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవడంతో అందుకు ప్రసాద్ నిరాకరించాడు. దీంతో ఈ విషయం కాస్త పంచాయతీ పెద్దల వద్దకు వెళ్లడంతో మనస్థాపానికి గురైన రమ్యకృష్ణ గతంలో రెండు పర్యాయాలు ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.

ఇటీవల పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలనే ఒప్పందం కుదరగా ఆ యువతికి చెప్పకుండానే ప్రసాద్ కువైట్‌కు ఉపాధి కోసం వెళ్లిపోయాడు. దీంతో ఆ యువతి ఇంట్లో వారు చూసిన సంబంధం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రసాద్ గతంలో చనువుగా ఉన్నటువంటి ఫోటోలను వాట్సాప్‌లో తన స్నేహితులకు పంపించడంతో ఆ యువతి పెళ్లి ఆగిపోయింది. దీంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది. సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో రోదిస్తూ ఇంట్లోకి వెళ్లి తలుపులు బిగించుకుని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంది. మంటలను తాళలేక ఆరుపులు వేయడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు తలుపులు బద్దలు కొట్టి మంటలను ఆర్పివేశారు. ఆప్పటికే ఆమె 90 శాతం కాలిపోగా,108 వాహనంలో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గత 6రోజులుగా చావుతో పోరాడిన రమ్యకృష్ణ ఇవాళ ఉదయం తనువు చాలించింది. కాగా, మాక్లూర్ ఎస్సై రామునాయుడు ఆసుపత్రిలో ఆ యువతి వాంగ్మూలం రికార్డు చేయగా బాధితురాలు ఉద్వేగానికి లోనైంది. అసభ్యకర చిత్రాలతో తనను లోబర్చుకున్న కోన ప్రసాద్‌ను ఉరి తీయాలని తనకు జరిగిన అన్యాయం మరో యువతికి జరగవద్దని వేడుకుంది.

Comments

comments