Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్

Baaghi 2 Box Office Collection Day 5 Tiger Shroff Disha Patani

‘లోఫర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముంబయి భామ దిశాపటాని. ఆ చిత్రంలో ఆమె చాలా వరకు పద్ధతిగానే కనిపించింది. ఆతర్వాత ఈ బ్యూటీ బాలీవుడ్ సినిమాల్లో మాత్రం హాట్‌హాట్‌గా నటించింది. ‘భాగీ-2’ సినిమాలో తన అందాలతో అదరగొట్టింది. ఇక దిశా బయట ఏ ఫొటోషూట్ చేసినా… ఏ అవార్డుల వేడుకలో పాల్గొన్నా హద్దులు మీరి అందాలొలికించింది. ఇక దిశా పటాని ఇన్‌స్టాగ్రామ్‌లో  హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తోంది. ఈ ఫొటోలకు లక్షల లైక్స్ వస్తుండడం విశేషం. సోషల్ మీడియాలో ఈ ఫొటోలతో తన ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంది దిశా. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను 1.26 కోట్ల మంది అనుసరిస్తుండడం విశేషం. తాజాగా దిశా షేర్ చేసిన ఓ హాట్ ఫొటోకు 9 లక్షల లైక్స్ వచ్చాయి. ఈ భామకు ఎంత ఫాలోయింగ్ ఉందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.

Comments

comments