Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

రూ.375 కోట్లతో బాహుబలి ప్రీక్వెల్!

Baahubali prequel to be Started Rs 375 Crore

బాహుబలి-1, బాహుబలి-2 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. కానీ ఇప్పుడు బాహుబలి-1కు ముందు జరిగిన కథతో ఓ సినిమా వస్తోంది. అంటే శివగామి నేపథ్యంలో ఓ సినిమా వస్తుందన్నమాట. అవును బాహుబలి-1కు ఇప్పుడు ప్రీక్వెల్ వస్తోంది. ఈ మేరకు వెబ్ సిరీస్ ప్లాన్ చేసింది నెట్ ఫ్లిక్స్. భారీ బడ్జెట్‌తో ఇది తెరకెక్కనుంది. బాహుబలి ప్రీక్వెల్ అనేది ఎంతో కాలంగా వినిపిస్తున్న విషయమే అయినా… ఇప్పుడు దీనికి ఓ రూపు వచ్చింది. బడ్జెట్ కేటాయింపులు జరగడంతో పాటు దర్శకుడు కూడా  ఖరారయ్యాడు. 375 కోట్ల రూపాయల వ్యయంతో, మూడు సీజన్లలో బాహుబలి ప్రీక్వెల్ తీయాలని నిర్ణయించారు. ఈ వెబ్ సిరీస్‌కు దేవ్ కట్టా దర్శకుడిగా పనిచేయబోతున్నాడు. అది కూడా రాజమౌళి పర్యవేక్షణలో ఈ సిరీస్ రూపుదిద్దుకోనుంది. ఈ వెబ్ సిరీస్‌కు ‘శివగామి’ అనే టైటిల్ పెట్టారు. టైటిల్‌కు తగ్గట్టే శివగామి పాత్ర చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది. మాహిష్మతి సామ్రాజ్యాన్ని విస్తరించడంలో శివగామి ఎలాంటి పాత్ర పోషించిందనే యాంగిల్‌లో  ఇది ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ కోసం నటీనటుల్ని ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభించాడు దేవ్‌కట్టా. ప్రస్తుతం ఈ దర్శకుడు తన తొలి హిందీ సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. అది పూర్తయిన వెంటనే శివగామి వెబ్ సిరీస్ పట్టాలపైకి వస్తుంది.

Comments

comments