Home ఆఫ్ బీట్ విదేశీయుల నోట బాహుబలి పాట.. పాట వింటే షాకవుతారు!

విదేశీయుల నోట బాహుబలి పాట.. పాట వింటే షాకవుతారు!

bahubali2

బాహుబలి సినిమా పాటలు కేవలం భారతీయులనే కాదు విదేశీయులను కూడా ఎంతగానో ఆకట్లుకుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ప్రేక్షకుల మన్ననలను పొందిన బాహుబలి, బాహుబలి2 చిత్రాలు అన్ని ప్రపంచంలోని అన్ని భాషల చిత్రాల కలెక్షన్లను మించి కలెక్షన్లు సంపాదించిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల్లోని పాటలు అందరినీ ఆకట్లుకున్నాయనడంలో అతిశయోక్తిలేదు. దేశ విదేశాల్లోనూ ఈ సినిమా పాటలు అందరి నోటా పాడించాయి. స్టెప్పులేయించాయి కూడా.

ఇటీవల ఇండోనేషియాలోని ఓ మ్యూజిక్ బ్యాండ్ బాహుబలి2 లోని టైటిల్ (తెలుగు) పాటను అద్భుతంగా పాడి అక్కడి జనాన్ని అబ్బురపరిచారు. సాక్షాత్తు తెలుగు గాయకులు పాడిన రీతిలో పాటను పాడిన మ్యూజిక్ బృందాన్ని భారతీయులు సోషల్ మీడియాల్లో పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. బాహుబలి టైటిల్ సాంగ్ ను ఇరగదీసిన విదేశీయులు అంటూ నెటిజన్లు వారి అభిప్రాయాలను తెలుపుకున్నారు.

https://www.youtube.com/watch?v=6KmREV9okl4

Baahubali song of foreigners .. Watch the video yourself!