Search
Saturday 22 September 2018
  • :
  • :

‘మిషన్ భగీరథ పథకం’ ది బెస్ట్

Mission-Bhageerathaమెదక్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం బేషుగ్గా ఉందన్నారు మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి బాబన్‌రావు లోనికర్. మిషన్ భగీరథ పథకం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన పథకాల్లో ది బెస్ట్ అని అన్నారు. ఆదివార ఆయన మెదక్ జిల్లాలోని పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేటలో మిషన్ భగీరథ పనులు, ఇంటెక్ వెల్స్‌ను పరిశీలించిన తర్వాత మాట్లాడుతూ… సిఎం కెసిఆర్ పాలన తీరు బాగుందని కితాబిచ్చారు. మహారాష్ట్రలో మూడేళ్ల నుంచి తీవ్ర కరువు నెలకొని ఉందని తెలిపారు. గతేడాది లాతూరు ప్రాంతంలో నీటి ఎద్దడి ఏర్పడటంతో రైళ్ల ద్వారా తాగునీటిని సరఫరా చేశామని గుర్తుచేశారు. తెలంగాణ కొత్త రాష్ట్రమైనా మిషన్ భగీరథ లాంటి మంచి పథకంతో ప్రజల దాహార్తిని తీర్చడానికి చేసే ప్రయత్నం బాగుందని పేర్కొన్నారు. మిషన్ భగీరథ పథకం గురించి కేబినెట్‌లో చర్చించి మహారాష్ట్రలో మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టడానికి కృషి చేస్తామన్నారు.

Comments

comments