Search
Friday 21 September 2018
  • :
  • :

నేడు బాబ్లీ గేట్ల ఎత్తివేత

Babli

మన తెలంగాణ/ బాసర : మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై ధర్మాబాద్ తాలుకా బాబ్లీ గ్రామం వద్ద నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఆదివారం ఉద యం ఎత్తనున్నారు. ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదలనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఏటా జూలై 1న గేట్లను తెరిచి అక్టోబర్ 28 వరకు నీటి ప్రవాహం కొనసాగిస్తారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గేట్లను ఎత్తుతారు.

మహారాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉదయం బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తితే మధ్యాహ్నం వరకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు చేరుతుందని అధికారులు తెలిపారు. బాబ్లీ గేట్లు ఆదివారం ఉదయం ఎత్తివేసేందుకు కేంద్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అధికారులు సిద్దమయ్యారు.  గేట్ల ఎత్తివేతకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. తెలంగాణకు చెందిన ఎస్‌ఆర్‌ఎస్‌పి శాఖాధికారి డి.రామారావు మహారాష్ట్రకు చెందిన కలేకర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కృష్ణరావు, కేంద్ర సెంట్రల్ వాటర్ కమిటీ అధికారి వెంకటేశ్వర్లు (ఎస్‌ఈ)తో కలిసి శనివారం రాత్రి ప్రాజెక్టుకు చేరుకున్నారు. నీరు దిగువకు రానున్న నేపథ్యంలో గోదావరి నదిలో ఎవరినీ అనుమతించకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని, అన్ని ప్రభుత్వ శాఖాధికారులకు సమాచారం అందించి నీటిని విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.

Comments

comments