Home తాజా వార్తలు బాబ్లీ రెండు గేట్లు ఎత్తివేత

బాబ్లీ రెండు గేట్లు ఎత్తివేత

Babli-Project

 
నిర్మల్: ఎగువన ఉన్న మహారాష్ట్రలో వర్షాలు కురవడంతో బాబ్లీ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. వరద నీరు భారీగా చేరుతుండడంతో రెండు గేట్లు ఎత్తివేయాలని నీటి పారుదల శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. బాబ్లీ రెండు గేట్లు ఎత్తివేయడం ద్వారా 20 వేల క్యూసెక్కుల నీరు విడుదల కానుంది. కింద ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.