Home తాజా వార్తలు బాలభీముడు..!

బాలభీముడు..!

Baby Boy Born Heavy Weight is 4.95 Kgs in Kadapa district

అమరావతి: ఓ మహిళ ఏకంగా 4.95 కిలోల మగబిడ్డను జన్మనిచ్చిన అరుదైన ఘటన ఎపిలోని కడప జిల్లాలో జరిగింది. స్థానిక పుల్లంపేటలోని జిఎన్‌ నగర్‌కు చెందిన ప్రకాష్‌రాజు భార్య లక్ష్మీదివ్య సోమవారం 4.95 కిలోల మగ బిడ్డకు జన్మనిచ్చింది. చిత్తూరు జిల్లా పుత్తూరులోని సుభాషిణి మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఆమె ప్రసవించింది. ఈ సందర్భంగా డాక్టర్‌ సుభాషిణి మాట్లాడుతూ… దివ్యకు మూడు ప్రసవాలు తమ ఆస్పత్రిలోనే నిర్వహించామని తెలిపారు. మొదటి బిడ్డ 4 కిలోలు, రెండవ బిడ్డ 4.5 కిలోలు, మూడవ కాన్పులో 4.95 కిలోల బిడ్డను ప్రసవించినట్లు వివరించారు.