Home కామారెడ్డి పుట్టిన పది నిమిషాలకే పసికందు మృతి

పుట్టిన పది నిమిషాలకే పసికందు మృతి

డెలివరి సమయంలో అందుబాటులోలేని డాక్టర్
కాన్పు చేసిన స్టాఫ్ నర్సు

                    Pregnant

గాంధారి: నవ మాసాలు మోసిన తల్లికి కడుపుకోత మిగిలింది. పుట్టిన పది నిమిషాలకే పసికందు మృతి చెందడంతో బంధువుల రోదనలతో, ఆసుపత్రి ప్రాంగణం విలవిలలాడింది. వేకువ జాము న నొప్పులు రావడంతో అంబులెన్స్‌లో ఆసుపత్రికి వ చ్చిన గర్భిణికి డ్యూటిలో వున్న స్టాఫ్ నర్సు కాన్పు చే యడం, డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో పుట్టిన పదినిమిషాలకే పండంటి ఆడపిల్ల అనంతలోకాలకు వెళ్ళిపోయింది. వివరాలు ఇలా ఉన్నాయి. గాంధారి మండల గుర్జల్ గ్రామానికి చెందిన మంగ్లారం రూప (20) గర్భిని. తొమ్మిది నెలలు నిండడంతో ఏ సమ యంలోనైనా కాన్పు జరుగవచ్చు. ఆమెకది మొదటి కాన్పు.

ఈ క్రమంలో బుధవారం ఉదయం 5.30 గం. ల సమయంలో నొప్పులు రావడంతో కుటుంబ సభ్యు లు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అక్కడికి చేరుకున్న అ ంబులెన్స్ ఉదయం 7.15ని.లకు గాంధారి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో డ్యూటిలో ఉన్న స్టాఫ్ నర్సు వెంటనే గర్భినికి లోపలికి తీసుకు వెళ్ళింది. నొప్పులు ఎక్కువ కావడంతో సాదారణ డెలి వరికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆసుపత్రికి వచ్చిన అరగంటలోపే మంగ్లారు రూప ఓ పండంటి ఆడ బి డ్డను జన్మంచింది. కాని ఆ బిడ్డ పుట్టగానే ఏడువక పోవడంతో సాదారణ పరీక్షలు చేశారు.

పసికందు గుండె కొట్టుకుంటుంది, కాని స్వాస సరి గ్గా తీసుకోవడం లేదు, ఏడవడం లేదు. వెంటనే ఈ విషయాన్ని వైద్య సిబ్బంది డాక్టర్‌కు సమాచారం అం దించి, అంబులెన్స్‌లో పాపను కామారెడ్డికి తరలిం చారు. కాని మార్గమధ్యలోనే పాప మృతి చెందిందని కామారెడ్డి వైద్యులు తెలిపడంతో ఒక్కసారి రోధనలు మిన్నంటాయి.

గాంధారికి చేరుకున్న బంధువులు సమయానికి ఆసు పత్రికి చేరుకున్నా,డ్యూటిలో డాక్టర్ లేకపోవడంతో స్టాఫ్ నర్సు కాన్పు చేసిందని, సమయానికి స్పందించి వుంటే పాప బతికేదని ఆరోపించారు.

పాప మృతి చెందిన విషయం తల్లికి ఇంకా తెలియా దని, తెలిస్తే తల్లి మనసు ఎలా తల్లడిల్లిపోతుందా అని బోరున విలపించారు. ఈ విషయంపై స్థానిక వైద్యా ధికారి డా.వీరేంధర్ వివరణ కోరగా కాన్పు సమ యంలో పాపతల్లి నీరసంగా వుందని, రక్తం కూడా తక్కువగా వుందన్నారు. ఆమెకు మొదటి కాన్పు కావ డం, పుట్టిన పాప 3.2 కేజి పుట్టడంతో శ్వాస ఆడక మృతి చెందిందని తెలిపారు.