Home తాజా వార్తలు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో పసికందు అదృశ్యం

ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో పసికందు అదృశ్యం

Baby Kidnapped at Government Maternity Hospital

హైదరాబాద్ : కోఠి సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఆరు రోజుల వయస్సు ఉన్న ఓ పసికందు అదృశ్యమైంది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మతండాకు చెందిన విజయ ప్రసూతి కోసం ఈ ఆస్పత్రికి ఆరు రోజుల క్రితం వచ్చారు. ఆమె పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చారు. ఆమె కదల్లేని స్థితిలో ఉండడంతో ఓ గుర్తుతెలియని మహిళ వచ్చి పాపకు టీకా ఇప్పిస్తానంటూ శిశువును తీసుకుని వెళ్లింది. అయితే ఆ మహిళ తిరిగి రాకపోవడంతో విజయ ఆస్పత్రి సిబ్బందికి సమాచారం ఇచ్చింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఆస్పత్రిలోని సిసి కెమెరాలను పరిశీలించారు. శిశువును అపహరించిన మహిళ కోసం గాలిస్తున్నారు.

Baby Kidnapped at Government Maternity Hospital