Search
Friday 16 November 2018
  • :
  • :

పాపం.. పసిపాప…

ఎక్కడినుంచి వచ్చిందో  ఏమో తెలియదు
అమ్మ ఉంది కానీ నాన్న  లేదంటున్నది
ఏపాపం ఎరుగని  చిన్నారి

ఏకన్న తల్లో ఈ చిన్నారి

Girl-Missingనిర్మల్ : పాపంపసిపాప ఎక్కడినుంచి వచ్చిందో ఏమో తెలియదు. అమ్మ ఉంది కానీ నాన్న లేదంటున్నది. ఏపాపం ఎరుగని చిన్నారి తల్లి ఏకన్న తల్లో ఈ చిన్నారిని వదిలేసింది. వివరాల్లోకి వెళ్తే నిర్మల్ పట్టణంలోని లక్ష్మిచైతన్య ఆసుపత్రి సమీపంలో శుక్రవారం రాత్రి సమయం 10 గంటల ప్రాంతంలో పాప ఆసుపత్రి సమీపంలో నిద్రపోవుచున్నది. విషయాన్ని గమనించిన ఆసుపత్రి డాక్టర్ చైతన్య స్దానిక టౌన్ ఎస్సై సునీల్ కుమార్‌కు సమాచారం అందించారు. వెంటనే ఎస్సై జిల్లా బాలల పరిరక్షణాధికారి సగ్గం రాజుకు వివరాలు తెలుపడంతో రాత్రి 10ః30 నిమిషాలకు స్దానిక బాలసదనంలో చేర్చారు.

పాపకు సంబంధించిన వారు ఎవరైనా ఉంటే సరైన ధృవపత్రాలు తీసుకొని రావలేనని జిల్లా సంక్షేమాధికారి ఎ విజయలక్ష్మి తెలిపారు. శనివారం పాప యొక్క పూర్తి వివరాలు సేకరించగా,ఈశ్వరి (7) వయస్సు 7 సంవత్సరాలు అని తల్లి పేరు లక్ష్మి అని చేబుతుంది. తండ్రి లేదని అంటున్నది. ఈ సందర్భంగా డిడబ్లూఓ ఎ విజయ లక్ష్మి మాట్లాడుతూ పిల్లలతో బిక్షాటన చేయిస్తున్న తల్లిదండ్రుల పై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి ఎ విజయలక్ష్మి,బాలసదనంసూపరిండెంట్ నసీమ్‌జమాల్,జిల్లా బాలల పరిరక్షణాధికారి సగ్గం రాజు,సామాజిక కార్యకర్త ఎ కరుణశ్రీ,ఐసిపిఎస్ సిబ్బంది కిశోర్‌కుమార్,షీటీం సభ్యులు గంగాధర్,క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments