Home తాజా వార్తలు చిన్నారిని చంపి… ఆపై

చిన్నారిని చంపి… ఆపై

Murderహైదరాబాద్: జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని న్యూ లాల్‌బహదూర్‌నగర్‌లో మంగళవారం ఉదయం  దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో సుశీల అనే ఓ తల్లి  తన కూతురు దీక్ష(13 నెలలు) గొంతు కోసి  చంపింది. అనంతరం తాను సైతం గొంతుకోసుకుంది. ఈ ఘటనలో దీక్ష మృతి చెందింది. తల్లి సుశీల పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. సుశీల భర్త నారాయణరెడ్డి జీడిమెట్ల పారిశ్రామికవాడలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.  భర్త డ్యూటీకి  వెళ్లిన అనంతరం సుశీల ఈ దారుణానికి ఒడిగట్టిందని పోలీసులు తెలిపారు. పోస్టమార్టం కోసం  దీక్ష  మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు జీడిమెట్ల పోలీసులు తెలిపారు.

Baby Murder by Mother in Hyderabad