Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

జీడిమెట్ల సిఐ సమయస్ఫూర్తి

baby who was frightened from the clutches of the CI patrolling

హెచ్‌ఎంటి అటవీ ప్రాంతంలో చిన్నారిపై అఘాయిత్యాన్ని అడ్డుకున్న జీడిమెట్ల సిఐ శంకర్‌రెడ్డి
సకాలంలో సిఐ పెట్రోలింగ్ రాకతో కామాంధుడి బారి నుండి భయటపడ్డ చిన్నారి

మన తెలంగాణ/షాపూర్‌నగర్: ముక్కుపచ్చలారని చిన్నారిపై అఘాయిత్యానికి యత్నించాడు ఓ కా మాంధుడు. మూడో తరగతి చదు వుతున్న చిన్నారికి మాయమాటలు చెప్పి హెచ్‌ఎంటి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి తన కామవాంఛ తీర్చుకునేందుకు యత్నించగా అంతలోనే అటుగా పెట్రోలింగ్ చేస్తున్న జీడిమెట్ల సిఐ శంకర్‌రెడ్డి జరగబోయే దారుణాన్ని అడ్డుకున్నారు. సురక్షితంగా చిన్నారిని కాపాడిన పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడుపై పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేసి నేరస్థుడిని కటకటాల్లోకి నెట్టారు. వివరాళ్లొకి వెలితే….కుత్బుల్లాపూర్ ఓ కాలనీకి చెందిన ఎనిమిది సంవత్సరాల చిన్నారి మూడో తరగతి చదువుతోంది. ఆమె మంగళవారం స్కూల్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా అటాకాయించిన మున్నా అలియాజ్ రోహిత్ కుమార్ నేను మీబాబాయ్‌ను అవుతాను అంటూ మాయమాటలు చెప్పాడు. చిన్నారికి చిప్స్ ప్యాకెట్ ఇప్పించి నమ్మించిన అతగాడు చిన్నారిని హెచ్‌ఎంటి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లాడు. సబ్‌స్టేషన్ వెనుకబాగంలో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి తన కామవాంఛను తీర్చుకునేందుకు యత్నించాడు. ఆ సమయంలో చిన్నారి ఏడుస్తుండగా అదే సమయంలో రెగ్యులర్ పెట్రోలింగ్‌లో భాగంగా అటువైపు వెళుతున్న జీడిమెట్ల సర్కిల్ ఇన్‌స్సెక్టర్ శంకర్‌రెడ్డి వాహన డ్రైవర్ హోంగార్డు వెంకటేష్ అప్రమత్తతతో బాలికను గమనించారు. వెంటనే అక్కడకు వెళ్లి పోలీసులు చిన్నారిపై జరుగుతున్న అఘాయిత్యాన్ని అడ్డుకున్నారు. చిన్నారిని సురక్షితంగా చిన్నారి తల్లిదుండ్రుల చెంతకు చేర్చారు. బాలిక ఇచ్చిన వివరాల ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని బుధవారం కోర్టుకు తరలించారు.

పోలీసులు దేవుడిలా వచ్చి కాపాడారని తల్లిదండ్రులు ప్రశంస
తమ చిన్నారిని పోలీసుల దేవుడి రూపంలో వచ్చి కాపాడారని చిన్నారి తల్లిదండ్రులు కాలనీ వాసులు జీడిమెట్ల పోలీసులు సిఐ శంకర్‌రెడ్డి, హోంగార్డు వెంకటేష్‌లను ప్రశంసించారు. ఏ అఘాయిత్యం జరుగకుండా చిన్నారిని కాపాడిని వారికి జన్మజన్మలు రుణపడి ఉంటామని కంటతడి పెట్టుకొని కృతజ్ఞతలు పోలీసులకు తెలియజేశారు

Comments

comments