Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) చికెన్‌లో పురుగులు, బిర్యానీ దుర్వాసన

చికెన్‌లో పురుగులు, బిర్యానీ దుర్వాసన

బోడుప్పల్ స్వాగత్ బార్‌లో తనిఖీలు

                    Meat

మన తెలంగాణ/బోడుప్పల్ : చికెన్ ఫ్రైలో పురుగులు వచ్చిన సంఘటన మేడిపల్లి పిఎస్ పరిధిలోని స్వాగత్‌బార్‌లో చోటు చేసుకుంది. బోడుప్పల్ మున్సిపల్ పరిధిలోని స్వాగత్ బార్ అండ్ రెస్టారెంట్‌లోకి గురువారం రాత్రి ఫీర్జాదిగూడకి చెందిన కె.కుమార్ తన మిత్రులతో కలిసి వెళ్లి చికెన్ ఫ్రై అర్డర్ చేశారు. వారు అందించిన చికెన్‌లో పురుగులు దర్శనమివ్వడంతో కంగుతిన్న వారు ఇదేమిటని బార్ యాజమాన్యన్ని ప్రశ్నించగా నిర్లక్షంగా సమాధానమిచ్చారు. చికెన్ ఫ్రైతో పాటు బిర్యానీ వాసన రావడంతో కస్టమర్లు ఆందోళనకు దిగారు. దీంతో యాజమాన్యం సదరు కస్టమర్‌తో చర్చలు జరిపి జరిగిన సంఘటన బయటకు పొక్కకుండా జాగ్రత్త వహించినట్లు సమాచారం.

హోటల్స్‌లో మున్సిపల్ అధికారుల తనిఖీలు : బోడుప్పల్ మున్సిపల్ పరిదిలోని స్వాగత్ బార్, రెస్టారెంట్‌పై బోడుప్పల్ మున్సిపల్ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. స్వాగత్ బార్‌లో పురుగుల చికెన్ అంటూ ప్రచారం జరగడంతో స్పందించిన మున్సిపల్ శానిటరీ అధికారులు మున్సిపల్ కమిషనర్ ఆర్.ఉపేందర్ రెడ్డి ఆదేశాల మేరకు బార్‌లో తనిఖీలు నిర్వహించి చికెన్, ఆహార పదార్థాలను పరిశీలించారు. అలాగే పరిసరాలు బాత్ రూంలు పరిశుభ్రంగా లేని కారణంగా యాజమాన్యాన్ని హెచ్చరించి సదరు రెస్టారెంట్ వారికి రూ.10,000లు జరిమానా విధించారు.