Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

కీచక గురువు

హోటల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో  విద్యార్థినులపై లైంగిక వేధింపులు
hyd1అంబర్‌పేట:అంబర్‌పేట నియోజకవర్గం విద్యానగర్ డీడీకాలనిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కళాశాలలో బీఎస్సీ హాస్పిటాలిటీ డిగ్రీ ఫస్ట్‌ఇయర్ చదువు తున్న విద్యార్థినిల పట్ల కళాశాలకు చెందిన ఓ ఫ్యాకల్టీ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఇది భరించలేక చివరకు లిఖిత పూర్వకంగా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు శనివారం డీడీకాలనీలో ఉన్న హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాలకు వచ్చి విచారణ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అదీనంలో నడుస్తున్న హోటల్ మేనేజ్‌మెంట్ కళా శాలలో దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు వచ్చి మూడు సంవత్సరాల బీఎస్సీ హాస్పిటాలిటీ కోర్సును చదువుతారు. ఈ సంవత్సరం కూడా దేశంలోని వివిధ ప్రాం తాల నుండి వచ్చి విద్యార్థులు ఈ కోర్సుల లో చేరారు. మూడు నెలల క్రితం తరగ తులు ప్రారంభమయ్యాయి. ఈ కళాశా లలో కమ్యూనికేషన్స్ అండ్ పర్సనల్ డెవలప్‌మెంట్ ఫ్యాకల్టీగా పనిచేసే అతను విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తిం చడం చేస్తున్నాడు. మూడు సంవత్సరాల క్రితం ఇతను ఈ కళాశాలలో ఫ్యాకల్టీగా చేరాడు.

తరగతి గదిలో లెక్చర్ ఇస్తూ విద్యార్థినిలను ఇబ్బందులు పడేలా వ్యవహరిస్తుంటాడు. సాయంత్రం 5 గంటలకే కళాశాల అయిపోయిన బాలికలను రాత్రి 9 గంటల వరకు ఉంచి క్లాసులను తీసుకుంటున్నాడు. ఇతని వేదింపులు భరించలేక విద్యార్థినీలు కళాశాల ఇతర మహిళా ఫ్యాకల్టీలకు ఫిర్యాదు చేయగా అతని విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ అంశాన్ని ప్రిన్సిపల్ పెద్దగా పట్టించుకొకుండా వెనుకేసుకొచ్చాడు. దీంతో విద్యార్థినులు చివరకు తాము పడుతున్న ఇబ్బందులను తెలుపుతూ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు ఉత్తరాలు వ్రాసారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు అచ్యుతరావు ,సంఘం అధ్యక్షురాలు అనురాధ, అర్గనైజర్ గాయత్రి, లీగల్ అడ్వయిజర్ శైలజ తదితరులు ఈ విషయాన్ని తూర్పుమండలం డీసీపీ డాక్టర్ వి.రవీందర్ ,ఏసీపీ సుధాకర్ దృష్టికి తీసు కెళ్లి కళాశాలకు వచ్చి విచారణ చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కళాశాలలో ఇద్దరు వ్యక్తులు లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నారనే తీవ్రమైన అరోపణలు వచ్చాయని,ప్రాథమిక అంచ నాను బట్టి వారు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తుందన్నారు.

ఈ విచా రణ ఇంకా రెండు,మూడు రోజులు కొనసాగుతుందని, తదనంతరం విచారణ రిపోర్టును ఉన్నతాధికారిణి స్వాతిలక్రా, హోం కార్యదర్శికి పంపిస్తామని పేర్కొ న్నారు. అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్లామన్నారు. తమతో పాటు పోలీసులు కూడా విచారణ చేస్తున్నారన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని ,హైదరాబాద్‌లో అమ్మాయిలకు రక్షణ ఉందని తెలిసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి చెబుతామన్నారు.

Comments

comments