అమరావతి : బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి. సింధును డిప్యూటీ కలెక్టర్గా నియమిస్తూ ఎపి ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలోని సచివాలయానికి తన తల్లిదండ్రులతో కలిసి ఆమె వచ్చారు. సిఎం చంద్రబాబునాయుడు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను ఆమె కలిశారు. సిఎం చంద్రబాబు ఆమెకు స్వయంగా ప్రభుత్వ ఉత్తర్వు కాపీని అందించారు. డిప్యూటీ కలెక్టర్గా నియమితం కావడంపై సింధు ఆనందం వ్యక్తం చేశారు.