Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

రష్యాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన…

54-severed-human-hands

మాస్కో: రష్యాలో ఒళ్లు జలదరించే వార్త ఒకటి వైరల్ అవుతోంది. అక్కడి సైబీరియా ప్రాంతంలో గల ఖబరోవ్క్‌ నగరంలో ఓ నది ఒడ్డున అనుమానాస్పద బ్యాగును గుర్తించిన పోలీసులు దాన్ని తెరిచి చూడగా అందులో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 54 అరచేతులు ఉన్నాయి. ఇది తీవ్రవాదుల పనేనా? వైద్య సంస్థలు చేశాయా? లేక శిక్షలా? అని తేల్చే పనిలో ప్రస్తుతం రష్యన్‌ పోలీసులు బిజీగా ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం… రష్యాలోని అముర్‌ నది ఒడ్డున ఒక  సంచిలో మణికట్టు వరకు నరికేసిన ఒక చేతిని గుర్తించిన అక్కడి వారు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులకు మరికొంత దూరంలో అనుమానాస్పదంగా ఓ బ్యాగు కనిపించింది. దాంతో ఆ  బ్యాగును తెరిచి చూడగా ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం కనిపించింది. అందులో ఏకంగా నరికేసిన 54 అరచేతులు ఉన్నాయి. దీంతో ఈ ఘటన అక్కడి వారిని భయభ్రాంతులకు గురిచేసింది. వెంటనే పోలీసులు ఆ చేతులను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్‌ విభాగానికి తరలించారు.  చేతులు ఎవరివి? అక్కడికి ఎలా వచ్చాయి? అనేది తెలియాల్సి ఉందన్నారు. అంతేగాక ఆ చేతులకు ఆసుపత్రుల్లో వాడే బ్యాండేజీలు, ప్లాస్టిక్‌ గ్లౌజులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో పరిశోధనల కోసం వైద్యులే చనిపోయిన వారి నుంచి ఈ చేతులను నరికారా?  లేక శిక్షల పేరుతో ఎవరైనా ఈ దురాగతానికి పాల్పడ్డారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

comments