Home తాజా వార్తలు బాఘి ట్రైలర్ విడుదల

బాఘి ట్రైలర్ విడుదల

BAAGHIముంబయి : తెలుగులో ఘన విజయం సాధించిన వర్షం చిత్రానికి రీమేక్‌గా బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రం బాఘి కావడం తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. బాలీవుడ్ నటులు టైగర్ ష్రాఫ్, శ్రద్ధాకపూర్ జంటగా నటించిన ఈ చిత్రానికి సబ్బిర్‌ఖాన్ దర్శకత్వం వహించారు. తెలుగు నటులు సుధీర్‌బాబు, కోటా శ్రీనివాసరావు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 29న బాఘి ప్రేక్షకుల ముందుకు రానుంది.