Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

కరాటేతో పెదరికాన్ని జయించిన భాగ్యరాజ్

 Bagyaraj karate training offered to 5000 girls

ఆత్మరక్షణ శిక్షణను అందిస్తున్న మాస్టర్ భాగ్యరాజు
మనతెలంగాణ/సిద్దిపేట రూరల్ : నలుగురిలో ప్రత్యేకంగా నిలవాలనే తపన… సాధించాలనే సంకల్పం ఇందుకు కఠోర సాధన తోడయితే అనుకున్న రంగంలో రాణించడం సులువే అని నిరూపించుకున్నాడు. జపాన్ కరాటే అసోషియేషన్ ఆధ్వర్యంలో శిక్షకుడు భాగ్యరాజ్ నేతృత్వంలో సుమారు ఇప్పటి వరకు 5వేల మంది బాలికలకు శిక్షణ ఇస్తున్నారు. నిరుపేద వైశ్య కుటుంబంలో జన్మించిన భాగ్యరాజ్ వృత్తి రీత్యా కిరాణ షాపు నడుపుకుంటూ తన తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. సిద్దిపేట పట్టణానికి రామిని వెంకటేశం, రాణి దంపతుల కూమారుడు భాగ్యరాజ్ తన తండ్రి కిరాణా షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కరాటే నేర్చుకుంటానని తన తండ్రికి తెలుపడంతో చిన్నతనం నుంచి కరాటే నేర్పించారు. అనుకున్నదే తడవుగా తన స్వంత కాళ్లపై నిలబడ్డారు. ఇప్పుడు భాగ్యరాజ్ మాస్టర్‌గా ఇప్పటి వరకు మిట్టపల్లి గురుకుల, కస్తూర్బా గాంధీ ప్రభుత్వపాఠశాలలో మాస్టర్‌గా చేరి సుమారు 5వేల మంది బాలికలకు శిక్షణ ఇస్తున్నారు. కరాటేలో మెలకువలు ఇండియన్ స్టిక్, నాన్‌చాక్, టోనోపౌ, సై, జుడో, సెల్ఫ్ టెక్నిక్స్‌లో శిక్షణ ఇస్తున్నాడు.
చదువుతో పాటు ఆత్మ రక్షణ విద్య అవసరం : భాగ్యరాజ్, మాస్టర్
విద్యార్ధి దశ నుంచే చదువుతో పాటు ప్రతి విద్యాలయంలో ఆత్మరక్షణ గురించి తరగతులు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. నేడు మన దేశంలో ఎటు చూసినా అమ్మాయిలపై అత్యాచారాలు, హత్యలు, దాడులను తప్పించుకోవాలంటే ఆత్మరక్షణకు కరాటే ఎంతగానో దోహదపడుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగ్గా కరాటే నేర్చుకోవడానికి ప్రోత్సహించాలి. దీనివలన శారీరక ఎదుగుదల, క్రమశిక్షణ, బరువు నియంత్రణ, ఆత్మస్థైర్యం అలవడుతుందని తెలుసుకోవాలని మాస్టర్ భాగ్యరాజ్ సూచించారు.

ఇప్పటి వరకు పొందిన పురస్కరాలు :
82006లో హైదరాబాద్ బేగంపేట షోటోకన్ కరాటే చాంపియన్ షిప్‌లో స్పారింగ్ విభాగంలో బంగారు పతకం
82007లో హైదరాబాద్ అంబర్‌పేట షాటోకాన్ కరాటే జాతీయ స్థాయిలో స్పారింగ్ విభాగంలో వెండిపతకం
82007లో సంగారెడ్డిలో జరిగిన రాష్ట్రస్థాయిలో కటాస్ విభాగంలో బంగారు పతకం
82008లో మహబూబునగర్‌లో జరిగిన ఆల్ ఇండియా ఓపెన్ కరాటే చాంపియన్ షిప్‌లో కటాఫ్ విభాగంలో బంగారు పతకం
82009లో అప్పటి సిద్దిపేట ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రివర్యులు హరీశ్‌రావు చేతుల మీదుగా బ్లాక్ బెల్ట్‌ఫస్టు డాన్
82012లో ఉత్తమ కరాటే మాస్టర్ ఎపి ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ్మ చేతుల మీదుగా ప్రశంసాపత్రం
82013లో జిల్లాలో ఉత్తమ కరాటే మాస్టర్ అవార్డు
82014 సినీనటుడు కరాటే అసోసియేషన్ చైర్మన్ సుమన్ చేతుల మీదుగా ప్రతిభ అవార్డు
82016లో సినీనటుడు సుమన్ చేతుల మీదుగా బ్లాక్ బెల్ట్ సెకండ్ డాన్ ప్రశంసాపత్రం
82017 చత్తీస్‌ఘడ్ రాయిపూర్‌లో రేపరి శిక్షణలో ఉత్తమ శిక్షకునిగా ఆల్‌ఇండియా చీఫ్ షిమనే, అవంద్ రత్న చేతుల మీదుగా ప్రశంసాపత్రం, ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో 15 బంగారు పతకాలు, 6 వెండి పతకాలు స్వంతం చేసుకున్నాడు.

Comments

comments