Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

ఆ సినిమాల రిలీజ్ డేట్స్ వచ్చేశాయ్

Bahubali 2 Is The Biggest Hindi Blockbuster

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘బాహుబలి’ తర్వాత బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం తమ బ్యానర్‌లో అమర్ అక్బర్ ఆంటోనీ, సవ్యసాచి చిత్రాలను చేస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టుల విడుదల తేదీలను ఈ బ్యానర్ నిర్మాతలు ప్రకటించారు. రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోని’ (అఅఆ). ఇలియానా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది. హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న విడుదల చేయాలని నిర్ణయించారు. ‘ప్రేమమ్’ వంటి సెన్సిబుల్ లవ్ ఎంటర్‌టైనర్ అనంతరం నాగచైతన్య, చందు మొండేటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘సవ్యసాచి’. ఈ చిత్రాన్ని నవంబర్ 2న విడుదల చేయనున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మాధవన్, భూమికలు కీలక పాత్రలు పోషిస్తుండడం విశేషం. ఒక పాట మినహా ‘సవ్యసాచి’ షూటింగ్ పూర్తయింది. ఇక ‘రంగస్థలం’ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మీద ప్రేక్షకులకు మంచి నమ్మకం ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరిలు తమ సంస్థ నుంచి రాబోతున్న తదుపరి చిత్రాల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Comments

comments