Search
Monday 24 September 2018
  • :
  • :

చైనాలో బాహుబలి-2

Amarendra Baahubali with Devasena

బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్  ‘బాహుబలి-2’ విడుదలై ఏడాది దాటిపోయింది. కాలానికి ఈ చిత్రం చైనాలో విడుదల కాబోతోంది. బాహుబలి మొదటి పార్టును చైనాలో రిలీజ్ చేయడంలో ఆలస్యం చేశామని… రెండో భాగం విషయంలో అలా జరగనివ్వబోమని నిర్మాత శోభు యార్లగడ్డ గతంలో పేర్కొన్నాడు. కానీ బాహుబలి-2 ఆలస్యాన్ని ఆయన కూడా ఆపలేకపోయాడు. ఒక దశలో ఈ చిత్రం చైనాలో విడుదలవుతుందా అన్న సందేహాలు కూడా కలిగాయి. ఎట్టకేలకు ఈ చిత్రం శుక్రవారం చైనాలో విడుదలకానుంది. బాహుబలి మొదటిపార్టుతో పోలిస్తే రెండవ పార్టుకు  థియేటర్ల సంఖ్య కొంచెం తక్కువే. తొలి భాగాన్ని 8 వేల థియేటర్లలో విడుదల చేశారు. ఇప్పుడు బాహుబలి-2 చిత్రాన్ని 7 వేల స్క్రీన్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అయితే  థియేటర్లు తక్కువైనప్పటికీ మంచి స్క్రీన్లు ఇచ్చినట్లు అక్కడి ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Comments

comments