Home తాజా వార్తలు మంద కృష్ణకు బెయిల్

మంద కృష్ణకు బెయిల్

Manda-Krishna

హైదరాబాద్ : సికింద్రాబాద్ సివిల్ కోర్టు ఎంఆర్‌పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. పది రోజులకొకసారి కార్ఖానా, రాంగోపాల్ పోలీసు స్టేషన్‌లలో హాజరు కావాలన్న షరతులతో పాటు ఇద్దరు వ్యక్తులతో పది వేల పూచీకత్తు సమర్పించాలని కోర్టు సూచించింది. ఈనెల 18న హైదరాబాద్‌లోని విద్యానగర్ చౌరస్తాలో మందకృష్ణ నేతృత్వంలో ఎంఆర్‌పిఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీ తీశారు. దీంతో అక్కడ ట్రాఫిక్ స్తంభించింది. ఈ క్రమంలో మందకృష్ణతో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. అనంతరం ఆయన కోర్టులో బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఆయన బెయిల్ పిటిషన్‌ను విచారించిన కోర్టు మంగళవారం ఆయనకు బెయిల్‌ను మంజూరు చేసింది.