Home అంతర్జాతీయ వార్తలు విరాట్ కోహ్లి అభిమానికి బెయిల్

విరాట్ కోహ్లి అభిమానికి బెయిల్

Tricolor-flagఇస్లామాబాద్ : భారత క్రికెటర్ విరాట్‌కోహ్లీ అభిమాని ఉమర్ ద్రాజ్‌కు పాకిస్థాన్‌లోని కోర్టు బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం ఉమర్ కేసు ఒకరా అడిషనల్ జిల్లా కోర్టులో విచారణకు వచ్చింది. బెయిల్ ఇవ్వాల్సిందిగా అతను పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు అంగీకరిస్తూ రూ.50వేలు పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. శనివారం జైలు నుంచి ఉమర్ బెయిల్‌పై బయటికి వచ్చాడు. పంజాబ్ ప్రావిన్సకి చెందిన ఉమర్ ద్రాజ్ కోహ్లికి వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన సంతోషంతో ఉమర్ తన ఇంటిపై త్రివర్ణ పతకాన్ని ఎగరువేశాడు. ఈ ఘటనలో అతనికి కోర్టు పది ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 18న బెయిల్ పిటిషన్ పెట్టుకున్నప్పటికీ తొలుత కోర్టు నికారించింది.