Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

రాజీవ్ దహదారిపై భజరంగ్ దళ్ ఆందోళన…

Bajrang Dal is concerned about Rajiv Rahadari

గజ్వేల్: స్వామి పరిపూర్ణానంద పై విధించిన భహిష్కరణను ఎత్తి వేయాలంటూ గురువారం ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై రాజ్తారోకో ఆందోళన నిర్వహించారు. దీంతో కొంత సేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ కార్యకర్తలు రోడ్డుకు అడ్డంగా భైఠాయించారు. వెంటనే గజ్వేల్ పోలీసులు ఆందోళన కారులను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.అరెస్టు చేసిన భజరంగ్ దళ్, బిజెవైఎం, విశ్వ హిందూ పరిషత్ నాయకులు, కార్యకర్తల పోలీసులు కేసులు నమోదు చేశారు. పరిఫూర్ణానంద స్వామిపై అక్రమ కేసులు బనాయించిన ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని భజరంగ్ దళ్ నాయకులు ఈసందర్భంగా ఆరోపించారు.

Comments

comments